IND vs NZ 1st Test : బెంగ‌ళూరు వేదిక‌గా భార‌త్, న్యూజిలాండ్ తొలి టెస్టు.. టీమ్ఇండియా అభిమానుల‌కు బ్యాడ్‌న్యూస్‌

బంగ్లాదేశ్‌తో టెస్టు, టీ20 సిరీస్‌ల‌ను క్లీన్‌స్వీప్ చేసి మంచి ఊపు మీదుంది టీమ్ఇండియా.

IND vs NZ 1st Test : బెంగ‌ళూరు వేదిక‌గా భార‌త్, న్యూజిలాండ్ తొలి టెస్టు.. టీమ్ఇండియా అభిమానుల‌కు బ్యాడ్‌న్యూస్‌

IND vs NZ 1st Test Will Rain Play Spoilsport In Bengaluru

Updated On : October 15, 2024 / 4:18 PM IST

IND vs NZ : బంగ్లాదేశ్‌తో టెస్టు, టీ20 సిరీస్‌ల‌ను క్లీన్‌స్వీప్ చేసి మంచి ఊపు మీదుంది టీమ్ఇండియా. అదే జోష్‌లో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌లోనూ విజ‌యం సాధించి డ‌బ్ల్యూటీసీ పాయింట్ల ప‌ట్టిక‌లో త‌న అగ్ర‌స్థానాన్ని మ‌రింత ప‌దిలం చేసుకోవాల‌ని భార‌త్ భావిస్తోంది. మ‌రోవైపు శ్రీలంక చేతిలో టెస్టు సిరీస్ ఓడిపోయిన న్యూజిలాండ్ జ‌ట్టు.. భార‌త్ పై విజ‌యం సాధించాల‌ని గ‌ట్టి ప‌ట్టుద‌ల‌గా ఉంది. ఈ క్ర‌మంలో బెంగ‌ళూరు వేదిక‌గా బుధ‌వారం (అక్టోబ‌ర్ 16) తొలి టెస్టు ప్రారంభం కానుంది.

అయితే.. ఈ మ్యాచ్‌కు వ‌రుణుడి ముప్పు పొంచి ఉంది. ఈ విష‌యాన్ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ తెలియ‌జేసింది. మ్యాచ్ జ‌రిగే ఐదు రోజులు వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు అంచ‌నా వేస్తోంది. ఇక మంగ‌ళ‌వారం ఉద‌యం నుంచి బెంగ‌ళూరులో భారీ వ‌ర్షం కురుస్తుండ‌డంతో టీమ్ఇండియా త‌న ప్రాక్టీస్ సెష‌న్‌ను ర‌ద్దు చేసుకుంది.

IND vs NZ : భార‌త్‌తో తొలి టెస్టుకు ముందే న్యూజిలాండ్‌కు భారీ షాక్‌..

వాతావ‌ర‌ణ శాఖ అంచ‌నా ప్ర‌కారం మొద‌టి రెండు రోజులు అంటే బుధ‌, గురు వారాల్లో 70 నుంచి 90 శాతం వ‌ర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. మూడో రోజు శ‌క్ర‌వారం 67 శాతం, నాలుగో రోజు 25 శాతం, ఐదో రోజు 40 శాతం వ‌ర్షం కురిసే సూచ‌న‌లు ఉన్న‌ట్లు పేర్కొంది.

బెంగ‌ళూరులోని చిన్నస్వామి స్టేడియంలో అత్యాధునికమైన ‘సబ్‌ఎయిర్‌’ సిస్టమ్‌ అందుబాటులో ఉంది. దీంతో ఎంత భారీ వ‌ర్షం కురిసినా కేవ‌లం గంట వ్య‌వ‌ధిలోనే మైదానాన్ని సిద్ధం చేసేందుకు అవ‌కాశం ఉంది. చూస్తుంటే తొలి రెండు రోజులు మ్యాచ్ వర్షార్ప‌ణం అయ్యే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి.

ఉప్పల్‌ మ్యాచ్‌లో 90 పరుగులు చేశాక సంజూ శాంసన్‌ రిస్క్‌ ఎందుకు తీసుకున్నాడు? అతడి సమాధానం ఇదే