IND vs NZ : భార‌త్‌తో తొలి టెస్టుకు ముందే న్యూజిలాండ్‌కు భారీ షాక్‌..

శ్రీలంక ప‌ర్య‌ట‌న‌లో టెస్టు సిరీస్‌ను కోల్పోయి ఘోర ప‌రాభ‌వాన్ని మూట‌గ‌ట్టుకుంది న్యూజిలాండ్‌.

IND vs NZ : భార‌త్‌తో తొలి టెస్టుకు ముందే న్యూజిలాండ్‌కు భారీ షాక్‌..

Ben Sears ruled out of India Test series with knee injury

Updated On : October 15, 2024 / 2:46 PM IST

India vs New Zealand : శ్రీలంక ప‌ర్య‌ట‌న‌లో టెస్టు సిరీస్‌ను కోల్పోయి ఘోర ప‌రాభ‌వాన్ని మూట‌గ‌ట్టుకుంది న్యూజిలాండ్‌. బుధ‌వారం నుంచి భార‌త్‌తో మూడు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడ‌నుంది. భార‌త్ పై విజ‌యం సాధించి ఘ‌నంగా స్వ‌దేశానికి వెళ్లాల‌ని ఆరాట‌ప‌డుతోంది కివీస్‌. అయితే.. తొలి టెస్టు ఆరంభానికి ముందే కివీస్‌కు భారీ షాక్ త‌గిలింది. ఇప్ప‌టికే సీనియ‌ర్ ఆట‌గాడు కేన్ విలియ‌మ్స‌న్ గాయం కాణంగా తొలి టెస్టుకు దూరం కాగా.. తాజాగా పేస‌ర్ బెన్ సియ‌ర్స్ సిరీస్ మొత్తానికి దూరం అయ్యాడు.

సియ‌ర్స్ మోకాలి గాయంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. అత‌డి స్థానంలో జాక‌బ్ డ‌ఫీని జ‌ట్టులోకి తీసుకున్న‌ట్లు పేర్కొంది. కివీస్ త‌రుపున జాక‌బ్ ఆరు వ‌న్డేలు, 14 టీ20లు ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 269 వికెట్లు తీశాడు.

ఉప్పల్‌ మ్యాచ్‌లో 90 పరుగులు చేశాక సంజూ శాంసన్‌ రిస్క్‌ ఎందుకు తీసుకున్నాడు? అతడి సమాధానం ఇదే

వాస్త‌వానికి బెన్ సియ‌ర్స్ శ్రీలంక‌తో టెస్టు సిరీస్ స‌మ‌యంలోనే మోకాలి నొప్పితో బాధ‌ప‌డుతున్నాడు. భార‌త్‌తో సిరీస్ నాటికి అత‌డు కోలుకుంటాడ‌ని భావించిన సెల‌క్ట‌ర్లు అత‌డిని ఎంపిక చేశారు.

కాగా.. ఇటీవ‌ల నిర్వ‌హించిన స్కానింగ్‌లో గాయం తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్న‌ట్లు తేలింది. దీంతో వైద్యులు అత‌డికి విశ్రాంతి ఇవ్వాల‌ని సూచించారు. ఈ నేప‌థ్యంలో అత‌డి స్థానంలో జాక‌బ్ డ‌ఫీని కివీస్ తీసుకుంది.

IND vs NZ : భార‌త్ వ‌ర్సెస్ న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌.. ఫ్రీగా ఎక్క‌డ చూడొచ్చొ తెలుసా?

భార‌త్‌తో మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌కు న్యూజిలాండ్ జ‌ట్టు ఇదే..
టామ్ లాథమ్ (కెప్టెన్), టామ్ బ్లండెల్, మైకేల్ బ్రేస్‌వెల్ (మొద‌టి టెస్టుకు మాత్రమే), మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, మ్యాట్ హెన్రీ, డారిల్ మిచెల్, విల్ ఒరుర్కే, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, జాకబ్ డపీ, ఇష్ సోథి( రెండు, మూడు టెస్టులకు), టిమ్ సౌథి, కేన్ విలియమ్సన్, విల్ యంగ్.