IND vs NZ : భార‌త్ వ‌ర్సెస్ న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌.. ఫ్రీగా ఎక్క‌డ చూడొచ్చొ తెలుసా?

టెస్టు, టీ20 సిరీసుల్లో బంగ్లాదేశ్‌ను భార‌త్ క్లీన్‌స్వీప్ చేసింది. ఇప్పుడు న్యూజిలాండ్‌తో సిరీస్‌కు స‌న్న‌ద్ధం అవుతోంది.

IND vs NZ : భార‌త్ వ‌ర్సెస్ న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌.. ఫ్రీగా ఎక్క‌డ చూడొచ్చొ తెలుసా?

India vs New Zealand test series 2024 live streaming details here

Updated On : October 14, 2024 / 8:57 PM IST

India vs New Zealand : టెస్టు, టీ20 సిరీసుల్లో బంగ్లాదేశ్‌ను భార‌త్ క్లీన్‌స్వీప్ చేసింది. ఇప్పుడు న్యూజిలాండ్‌తో సిరీస్‌కు స‌న్న‌ద్ధం అవుతోంది. అక్టోబ‌ర్ 16 (బుధ‌వారం) నుంచి న్యూజిలాండ్‌తో మూడు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడ‌నుంది. తొలి మ్యాచ్‌కు బెంగ‌ళూరు వేదిక కానుంది. ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ ఆడాలంటే ప్ర‌తి టెస్టు కీల‌క‌మైన నేప‌థ్యంలో కివీస్‌తో టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి డ‌బ్ల్యూటీసీ పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానంలో ఉన్న భార‌త్ త‌న స్థానాన్ని మ‌రింత ప‌దిలం చేసుకోవాల‌ని భావిస్తోంది.

న్యూజిలాండ్‌తో సిరీస్ అనంత‌రం ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది భార‌త్‌. బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్లు ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడ‌నున్నాయి.

Womens T20 World Cup 2024 : ఇదేమీ సిత్ర‌మో.. పాకిస్థాన్ గెల‌వాల‌ని కోరుకుంటున్న భార‌త అభిమానులు!

ఎక్క‌డ చూడొచ్చంటే..?

భార‌త్ వ‌ర్సెస్ న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌కు స్టోర్ట్స్ 18, జియో సినిమాస్ అధికారిక బ్రాడ్‌కాస్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. టీవీల్లో అయితే స్పోర్ట్ 18 ఛానెల్స్‌లో చూడొచ్చు. ఇక ఓటీటీలో అయితే జియో సినిమాస్‌లో ఫ్రీగా చూడొచ్చు. జియోసినిమా వెబ్‌సైట్ ద్వారా ఉచితంగా లైవ్‌ను చూడొచ్చు.

భార‌త్ వ‌ర్సెస్ న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్‌..

తొలి టెస్టు – అక్టోబ‌ర్ 16 నుంచి 20 వ‌ర‌కు – బెంగ‌ళూరు
రెండో టెస్టు – అక్టోబ‌ర్ 24 నుంచి 28 వ‌ర‌కు – పుణె
మూడో టెస్టు – న‌వంబ‌ర్ 1 నుంచి న‌వంబ‌ర్ 5 వ‌ర‌కు – ముంబై

Womens T20 World Cup 2024 : ఇంకొక్క ఛాన్స్ వ‌స్తే మాత్రం.. మేమేంటో చూపిస్తాం.. ఆసీస్‌తో ఓట‌మి అనంత‌రం కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కామెంట్స్‌

మ్యాచులు అన్ని భార‌త కాల‌మానం ప్ర‌కారం ఉద‌యం 9.30 గంట‌ల‌కు ప్రారంభం కానున్నాయి.