Gary Kirsten quits as Pakistan white ball coach
Gary Kirsten : దక్షిణాఫ్రికాకు చెందిన గ్యారీ కిర్‌స్టన్ గురించి టీమ్ఇండియా అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2011 వన్డే ప్రపంచకప్‌ను భారత జట్టు సాధించడంలో కోచ్‌గా కిర్‌స్టన్ కీలక పాత్ర పోషించాడు. కోచ్‌గా ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న ఆయన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఏరి కోరి మరి తెచ్చుకుంది. అయితే.. కేవలం ఐదు నెలలోనే అతడు ఆ జట్టును వీడాడు. మరో ఆరునెలల పదవీకాలం ఉన్నప్పటికి అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్రికెట్ వర్గాలు చెప్పాయి.
ఆటగాళ్లతో తీవ్ర విభేదాలు, పీసీబీ వైఖరి నచ్చకపోవడం వల్లే పరిమిత ఓవర్ల క్రికెట్‌కు కోచ్‌గా ఉన్న కిర్‌స్టన్ తన పదవికి రాజీనామా చేసినట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. ఆయన రాజీనామాను పీసీబీ వెంటనే ఆమోదించడం గమనార్హం. అంతేకాదండోయ్.. అతడి స్థానంలో టెస్టు జట్టుకు కోచ్‌గా ఉన్న జేసన్ గిలెస్పీకి అదనపు బాధ్యతలు అప్పగించింది. మూడు ఫార్మాట్లకు ప్రస్తుతం గిలెస్పీ కోచ్‌గా కొనసాగనున్నాడు.
IND vs NZ: న్యూజిలాండ్‌తో ఆఖరి టెస్టు.. ముగ్గురు సీనియర్లను పక్కన పెట్టనున్న టీమిండియా.. ఎందుకంటే?
ఈ ఏడాది మే నెల మధ్యలో పాకిస్థాన్ పరిమిత ఓవర్ల క్రికెట్‌కు కోచ్‌గా కిర్‌స్టన్ బాధ్యతలు చేపట్టాడు. ఇంగ్లాండ్ పర్యటనతో పాక్ కోచ్‌గా అతడి ప్రయాణం ప్రారంభమైంది. ఆ పర్యటనతో పాటు జూన్ నెలలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లోనూ పాకిస్థాన్ ఘోర పరాజయాలను చవిచూసింది. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్‌లో పసికూన యూఎస్ఏ చేతిలో ఓటమి పాలై గ్రూప్ దశ నుంచే నిష్ర్కమించింది.
తాను చేసిన రిక్వెస్ట్‌లను పీసీబీ పట్టించుకోకపోవడంతో పాటు ఆటగాళ్లతో భిన్నాభిప్రాయాలు కూడా కిర్‌స్టన్ కోచ్ పదవి నుంచి తప్పుకోవడానికి కారణాలుగా నిలిచాయని అంటున్నారు. మరో నాలుగు నెలల్లో సొంతగడ్డపై ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న వేళ కోచ్ రాజీనామా చేయడం పాకిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు.
Mohammed Shami : బీసీసీఐ, ఫ్యాన్స్‌కి సారీ చెప్పిన షమీ.. ఎందుకో తెలుసా?
కాగా.. బాబర్ ఆస్థాంలో మహ్మద్ రిజ్వాన్ వన్డే, టీ20 జట్లకు కెప్టెన్‌గా ప్రకటించిన 24 గంటల్లోనే కిర్‌స్టన్ తప్పుకోవడం గమనార్హం.