IND vs NZ: న్యూజిలాండ్‌తో ఆఖరి టెస్టు.. ముగ్గురు సీనియర్లను పక్కన పెట్టనున్న టీమిండియా.. ఎందుకంటే?
వచ్చే నెలలోనే ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ జరగనుంది. ఈ క్రమంలో మూడో టెస్టు కోసం టీం మేనేజ్ మెంట్ కీలక నిర్ణయాలను తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ముగ్గురు సీనియర్ ప్లేయర్లకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

IND vs NZ 3rd Test
IND vs NZ 3rd Test Match: స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో మూడు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా మూడో టెస్టు నవంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్ లు జరగ్గా.. రెండు మ్యాచ్ లలోనూ టీమిండియా ఓటమి పాలైంది. దీంతో మూడో మ్యాచ్ లోనైనా విజయం సాధించి పరువు నిలుపుకోవాలని భారత జట్టు భావిస్తుంది. దీనికితోడు వచ్చే నెలలోనే ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ప్రారంభంకానుంది. ఈ క్రమంలో మూడో టెస్టు కోసం టీం మేనేజ్ మెంట్ కీలక నిర్ణయాలను తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ముగ్గురు సీనియర్ ప్లేయర్లకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
Also Read: IND vs NZ : సిరీస్ ఓటమి నేపథ్యంలో కీలక నిర్ణయం.. సీనియర్లకు గంభీర్ షాక్..!
శుక్రవారం నుంచి ఇండియా – న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటికే 0-2 తేడాతో సిరీస్ ను కోల్పోయిన టీమిండియా.. మూడో టెస్టు మ్యాచ్ లో విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో తుది జట్టులో మూడు మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జస్ర్పీత్ బుమ్రా, రిషబ్ పంత్, రవీంద్ర జడేజాలకు విశ్రాంతి ఇవ్వాలని మేనేజ్ మెంట్ నిర్ణయించినట్లు సమాచారం.
Also Read: PAK vs ENG : బాబర్ ఆజామ్ లేకుండానే టెస్టు సిరీస్ గెలిచిన పాకిస్థాన్.. బాబర్ ఏమన్నాడంటే?
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కు జస్ర్పీత్ బుమ్రా లాంటి ప్లేయర్ ఎంతో కీలకం. ఈ క్రమంలో న్యూజిలాండ్ జట్టుతో మూడో టెస్టు మ్యాచ్ లో బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని రోహిత్, గంభీర్ లు భావిస్తున్నారట. దీంతో మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ పేస్ ద్వయంతో భారత్ బరిలోకి దిగుతుంది. అదేవిధంగా తొలి టెస్టు మ్యాచ్ లో రిషబ్ పంత్ మోకాలికి గాయమైంది. బెంగళూరు టెస్టులో గాయపడినప్పటికీ మోకాలి నొప్పితోనే పంత్ బ్యాటింగ్ చేశాడు. రెండో టెస్టులో అతనికి విశ్రాంతి ఇస్తారని అందరూ భావించారు. కానీ, పంత్ రెండో టెస్టులో ఆడాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కు పంత్ సేవలు ఎంతో అవసరం. ఆసీస్ పై పంత్ ట్రాక్ రికార్డు ఎంతో మెరుగ్గా ఉంది. దీంతో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కు సన్నద్ధమయ్యేందుకు పంత్ కు కివీస్ తో మూడో టెస్టు మ్యాచ్ లో విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు కూడా టీం మేనేజ్ మెంట్ విశ్రాంతి ఇవ్వాలనే యోచనలో ఉంది.
ముగ్గురు ప్లేయర్లకు విశ్రాంతి ఇస్తే.. దృవ్ జురెల్, కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్ తుది జట్టులో చేరనున్నారు. కేఎల్ రాహుల్ మొదటి టెస్టులో ఆడినప్పటికి బ్యాటింగ్ లో ఆశించిన స్థాయిలో పరుగులు రాబట్టలేక పోయాడు. దీంతో రెండో టెస్టు తుది జట్టులో అతనికి అవకాశం దక్కలేదు. మూడో టెస్టులో ముగ్గురు సీనియర్ ప్లేయర్లకు విశ్రాంతి ఇచ్చే యోచనలో టీం మేనేజ్ మెంట్ ఉండటంతో తుది జట్టులోకి కేఎల్ రాహుల్ కు చోటు దక్కే అవకాశం ఉంది.