IND vs NZ : సిరీస్ ఓటమి నేపథ్యంలో కీలక నిర్ణయం.. సీనియర్లకు గంభీర్ షాక్..!
దాదాపు 12 సంవత్సరాల తరువాత టీమ్ఇండియాకు సొంత గడ్డపై పరాభవం ఎదురైంది.

Gautam Gambhir Strict Stance After Pune Loss
దాదాపు 12 సంవత్సరాల తరువాత టీమ్ఇండియాకు సొంత గడ్డపై పరాభవం ఎదురైంది. బ్యాటర్ల వైఫల్యంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే న్యూజిలాండ్ చేతిలో భారత్ టెస్టు సిరీస్ ఓడిపోయింది. స్వదేశంలో వరుసగా 18 టెస్టు సిరీస్‌లు గెలిచిన రికార్డుకు ఈ ఓటమితో బ్రేక్ పడింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ అవకాశాలు కష్టతరం అయ్యాయి. ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గంభీర్‌కు ఇది ఊహించని ఫలితంగానే చెప్పవచ్చు.
ముంబై వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నవంబర్ 1 నుంచి మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి వైట్‌వాష్ నుంచి తప్పించుకుని పరువు దక్కించుకోవాలని భారత్ భావిస్తోంది. ఈ క్రమంలో గౌతమ్ గంభీర్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు సీనియర్లకు ఇస్తున్న ఆప్షనల్ ట్రైనింగ్ సెషన్‌ను రద్దు చేసినట్లుగా సమాచారం.
Virat Kohli : సహనం కోల్పోయిన కోహ్లీ.. బాక్స్ పై ప్రతాపం.. వీడియో వైరల్
ఇక నుంచి సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా ప్రతి ఒక్క ఆటగాడు ఖచ్చితంగా ట్రైనింగ్‌లో పాల్గొనాలని గంభీర్ ఆదేశించాడట. ఇప్పటి వరకు రోహిత్, కోహ్లీ, బుమ్రా వంటి సీనియర్ ఆటగాళ్లకు ట్రైనింగ్ సెషన్ ఆప్షనల్‌గా ఉండేది. వీరు గాయాల పాలు కాకుండా ఉండేందుకు ఇలా చేసేవారు. ప్రస్తుతం గంభీర్ దాన్ని రద్దు చేశాడట.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ ప్రకారం.. భారత జట్టు ఆదివారం ముంబైకి చేరుకోనుంది. ఆటగాళ్లకు రెండు రోజులు విశ్రాంతి ఇచ్చారు. అక్టోబర్ 30, 31న ప్రాక్టీస్ సెషన్‌ను నిర్వహించనున్నారు. ఈ రెండు రోజుల్లో జరిగే ప్రాక్టీస్ సెషన్స్‌లో ఖచ్చితంగా భారత ఆటగాళ్లు అందరూ పాల్గొని గంభీర్ చెప్పినట్లు పేర్కొంది.