Yashasvi Jaiswal : సిక్స‌ర్ల కింగ్ య‌శ‌స్వి జైస్వాల్ .. 92 ఏళ్ల భార‌త టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో ఒకే ఒక్క‌డు

పూణే వేదిక‌గా జ‌రిగిన రెండో టెస్టులో భార‌త్ 113 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది.

Yashasvi Jaiswal : సిక్స‌ర్ల కింగ్ య‌శ‌స్వి జైస్వాల్ .. 92 ఏళ్ల భార‌త టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో ఒకే ఒక్క‌డు

First Time In 92 Years Jaiswal Makes Never Done Before India Test Record

Updated On : October 27, 2024 / 10:27 AM IST

Yashasvi Jaiswal : పూణే వేదిక‌గా జ‌రిగిన రెండో టెస్టులో భార‌త్ 113 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది. 359 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌లో టీమ్ఇండియా 245 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. టీమ్ఇండియా బ్యాట‌ర్ల‌లో య‌శ‌స్వి జైస్వాల్ (77; 65 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) ఒక్క‌డే హాఫ్ సెంచ‌రీతో రాణించాడు. ఈ ఇన్నింగ్స్‌లో మూడు సిక్స‌ర్ల‌ను కొట్ట‌డం ద్వారా య‌శ‌స్వి జైస్వాల్ అరుదైన ఘ‌న‌త అందుకున్నాడు.

టెస్టుల్లో ఓ క్యాలెండ‌ర్ ఇయ‌ర్‌లో 30 కంటే ఎక్కువ సిక్స‌ర్లు బాదిన తొలి భార‌త ఆట‌గాడిగా రికార్డులు సృష్టించాడు. ఇక ఓవ‌రాల్‌గా చూసుకుంటే రెండో ప్లేయ‌ర్‌గా రికార్డుల‌కు ఎక్కాడు. న్యూజిలాండ్ ఆట‌గాడు బ్రెండ‌న్ మెక్‌క‌ల్ల‌మ్ 2014లో 33 సిక్స‌ర్లు కొట్టాడు. ఇక జైస్వాల్ ఇప్ప‌టి వ‌ర‌కు 32 సిక్స‌ర్లు బాదాడు. మూడో టెస్టులో రెండు సిక్స‌ర్లు బాదితే మెక్‌క‌ల్ల‌మ్ రికార్డులను బ‌ద్ద‌లు కొడుతాడు.

WTC Final 2024: టీమిండియా డబ్ల్యూటీసీ ఫైన‌ల్‌కు చేరాలంటే ఇంకా ఎన్ని మ్యాచ్‌లు గెలవాలి.. సమీకరణలు ఇలా..

ఈ ఇయ‌ర్‌లో జైస్వాల్ ఇంకా కివీస్‌తో మూడో టెస్టుతో పాటు ఆసీస్ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో నాలుగు టెస్టులు ఆడ‌నున్నాడు. దీంతో మెక్‌క‌ల్ల‌మ్ రికార్డును జైస్వాల్ ఈజీగా బ్రేక్ చేసే అవ‌కాశం ఉంది.

స్వ‌దేశంలో 1000కి పైగా ప‌రుగులు..

య‌శ‌స్వి జైస్వాల్ సూప‌ర్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది టెస్టుల్లో 19 ఇన్నింగ్స్‌ల్లో 1084 ప‌రుగులు చేశాడు. ఈ క్ర‌మంలో స్వ‌దేశంలో 1000 కి పైగా ప‌రుగులు చేసిన మూడో ఆట‌గాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. అత‌డికంటే ముందు 1979లో గుండ‌ప్ప విశ్వానాథ్‌, 1979లో సునీల్ గ‌వాస్క‌ర్‌లు ఈ ఫీట్‌ను న‌మోదు చేశారు.

IND vs NZ : రెండో టెస్టులో భార‌త్ ఓట‌మి.. టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ కామెంట్స్‌..