PAK vs ENG : బాబర్ ఆజామ్ లేకుండానే టెస్టు సిరీస్ గెలిచిన పాకిస్థాన్.. బాబర్ ఏమన్నాడంటే?
దాదాపు మూడేళ్ల తరువాత స్వదేశంలో పాకిస్థాన్ టెస్టు సిరీస్ విజయాన్ని సాధించింది.

Babar Azam congratulates pakistan cricket team for winning test series
PAK vs ENG : దాదాపు మూడేళ్ల తరువాత స్వదేశంలో పాకిస్థాన్ టెస్టు సిరీస్ విజయాన్ని సాధించింది. 2-1 తేడాతో ఇంగ్లాండ్ పై గెలిచింది. ఈ విజయంతో ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ 2025 పాయింట్ల పట్టికలో ఓ స్థానం ఎగబాకి ఏడవ స్థానానికి చేరుకుంది. మూడు మ్యాచుల సిరీస్‌లో తొలి టెస్టు ఓటమి తరువాత వరుసగా రెండు మ్యాచుల్లోనూ పాకిస్థాన్ గెలిచి సిరీస్ అందుకోవడం విశేషం.
తొలి టెస్టు మ్యాచ్ ఓటమి అనంతరం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చర్యలు చేపట్టింది. స్టార్ ఆటగాళ్లు బాబర్ అజామ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షాలను జట్టు నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. ఇక పాకిస్థాన్ టెస్టు సిరీస్ గెలిచిన తరువాత బాబర్ అజామ్ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. గొప్ప ప్రదర్శన చేశారు. నోమన్, సాజిద్ అద్భుతన ప్రదర్శన చేశారు. కంగ్రాట్స్ పాకిస్థాన్ అంటూ ట్వీట్ చేశాడు.
IND vs NZ : సిరీస్ ఓటమి నేపథ్యంలో కీలక నిర్ణయం.. సీనియర్లకు గంభీర్ షాక్..!
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 267 పరుగులు చేసింది. అనంతరం పాకిస్థాన్ మొదటి ఇన్నింగ్స్‌లో 344 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్ ఇంగ్లాండ్ 112 పరుగులకు ఆలౌట్ కాగా.. 37 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పాక్ ఒక్క వికెట్ కోల్పోయి ఛేదించింది. పాక్ విజయంలో స్పిన్నర్లు నోమన్, సాజిద్ లు కీలక పాత్ర పోషించారు. వీరిద్దరు ఈ మ్యాచ్‌లో 19 వికెట్లు పడగొట్టారు.
స్వదేశంలో 2021లో పాకిస్థాన్ 2-0తో దక్షిణాఫ్రికాను ఓడించింది. ఆ తరువాత స్వదేశంలో జరిగిన మరే సిరీస్‌ను గెలవలేదు. ఆఖరికి మూడేళ్ల తరువాత ఇంగ్లాండ్ పై విజయం సాధించింది. దీంతో పాకిస్థాన్ అభిమానులు ఆనందంగా ఉన్నారు.
Virat Kohli : సహనం కోల్పోయిన కోహ్లీ.. బాక్స్ పై ప్రతాపం.. వీడియో వైరల్
Phenomenal effort once again to make a grand comeback. Amazing turnaround by Noman and Sajid!
Congratulations, Team Pakistan 🇵🇰 ❤️ pic.twitter.com/J56VIITp5z
— Babar Azam (@babarazam258) October 26, 2024