×
Ad

Rohit Sharma : రోహిత్ శ‌ర్మ‌ను ఆట‌ప‌ట్టించిన‌ గౌత‌మ్ గంభీర్‌.. ‘నీ ఫేర్‌వెల్‌ మ్యాచ్ క‌దా ? ఒక్క ఫోటో అయినా..’

టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌(Rohit Sharma)ను హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆట‌ప‌ట్టించాడు.

Gautam Gambhir teases Rohit Sharma after IND vs AUS 2nd ODI match

Rohit Sharma : దాదాపు ఏడు నెల‌ల విరామం త‌రువాత టీమ్ఇండియా సీనియ‌ర్ ఆట‌గాడు రోహిత్ శ‌ర్మ అంత‌ర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు. ఆసీస్‌తో జ‌రిగిన తొలి వ‌న్డే మ్యాచ్‌లో విఫ‌ల‌మైన‌ప్ప‌టికి రెండో వ‌న్డే మ్యాచ్‌లో హాఫ్ సెంచ‌రీతో రాణించాడు. ఒకే ఓవ‌ర్‌లో కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్‌, స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ ఔట్ కావ‌డంతో త‌న స‌హ‌జ‌శైలికి భిన్నంగా హిట్‌మ్యాన్ రెండో వ‌న్డేలో ఆడాడు.

తొలుత క్రీజులో నిల‌దొక్కుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చిన ఈ స్టార్ బ్యాట‌ర్ ఆ త‌రువాత త‌న‌దైన శైలిలో ప‌రుగులు రాబ‌ట్టాడు. మొత్తంగా 97 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స‌ర్ల సాయంతో 73 ప‌రుగులు చేశాడు. ఇక శ్రేయ‌స్ అయ్య‌ర్‌తో క‌లిసి మూడో వికెట్‌కు 118 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు. త‌న‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు బ్యాట్‌తోనే స‌మాధానం ఇచ్చాడు.

WTC Points Table 2027 : ఒక్క మ్యాచ్‌తో రెండు నుంచి ఐదుకు పాక్‌.. డ‌బ్ల్యూటీసీ పాయింట్ల ప‌ట్టిక‌లో మెరుగైన భార‌త స్థానం..

రోహిత్ శ‌ర్మ(Rohit Sharma) రాణించిన‌ప్ప‌టికి కూడా ఈ మ్యాచ్‌లో భార‌త్ ఓడిపోయింది. భార‌త జ‌ట్టు హోట‌ల్‌కు చేరుకున్న త‌రువాత ఆట‌గాళ్లు త‌మ త‌మ గ‌దుల్లోకి వెళ్లేముందు టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌ను ఆట‌ప‌ట్టించాడు. ‘రోహిత్‌.. ఇది అంద‌రికి నీ వీడ్కోలు మ్యాచ్‌లా అనిపిస్తోంది. ఒక్క ఫోటో అయినా పెట్టు.’ అని అన్నాడు. దీనికి రోహిత్ ఎలాంటి స‌మాధానం ఇవ్వ‌కుండా న‌వ్వుతూ లోనికి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Rohit Sharma : శ‌నివారం ఆసీస్‌తో మూడో వ‌న్డే.. రోహిత్ శ‌ర్మ‌ను ఊరిస్తున్న సిక్స‌ర్ల రికార్డు..

ఆసీస్‌తో వ‌న్డే సిరీస్‌కు ముందు రోహిత్ శ‌ర్మ‌ను కెప్టెన్సీ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఆసీస్‌తో సిరీస్ త‌రువాత వ‌న్డేల‌కు రోహిత్ శ‌ర్మ గుడ్ బై చెబుతాడ‌నే ప్ర‌చారం సాగుతోంది. తొలి వ‌న్డేలో విఫ‌లం అయిన ఆ త‌రువాత ఈ ప్ర‌చారం మ‌రింత ఎక్కువైంది. ఇక రెండో వ‌న్డేలో రాణించి త‌న‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు రోహిత్ బ్యాట్‌తో స‌మాధానం చెప్పాడు. దీనిపైనే గంభీర్ విమ‌ర్శ‌కుల‌కు ఇలా కౌంట‌ర్ ఇచ్చిన‌ట్లుగా అర్థ‌మ‌వుతోంది.