WTC Points Table 2027 : ఒక్క మ్యాచ్‌తో రెండు నుంచి ఐదుకు పాక్.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మెరుగైన భారత స్థానం..
పాకిస్తాన్‌ను దక్షిణాఫ్రికా ఓడించడంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో (WTC Points Table 2027) భారత స్థానం మెరుగైంది.
Updated WTC Points Table 2027 after South Africa win against Pakistan in 2nd test
WTC Points Table 2027 : దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో పాకిస్తాన్ ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఫలితంగా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ 1-1తో సమమైంది. ఈ మ్యాచ్‌లో ఓడిపోవడంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ స్థానం పడిపోయింది. టీమ్ఇండియా స్థానం మెరుగుపడింది.
డబ్ల్యూటీసీ 2025-27లో భాగంగా దక్షిణాఫ్రికా, పాక్ జట్లు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడ్డాయి. తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన పాక్ అనూహ్యంగా పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. అయితే.. రావల్పిండి వేదికగా రెండో మ్యాచ్‌లో ఓడిపోవడంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో (WTC Points Table 2027) రెండు నుంచి ఐదో స్థానానికి పడిపోయింది.
Rohit Sharma : శనివారం ఆసీస్‌తో మూడో వన్డే.. రోహిత్ శర్మను ఊరిస్తున్న సిక్సర్ల రికార్డు..
ఇక తొలి మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికి కూడా రెండో మ్యాచ్‌లో గెలిచిన దక్షిణాప్రికా నాలుగో స్థానానికి చేరుకుంది. ఇక ఆస్ట్రేలియా అగ్రస్థానంలోనే కొనసాగుతుండగా.. శ్రీలంక మూడు నుంచి రెండుకు, భారత్ నాలుగు నుంచి మూడో స్థానానికి చేరుకుంది.

ఇక ఆరో స్థానంలో ఇంగ్లాండ్, ఏడో స్థానంలో బంగ్లాదేశ్, ఎనిమిదో స్థానంలో వెస్టిండీస్ లు ఉన్నాయి. కాగా.. న్యూజిలాండ్ జట్టు డబ్ల్యూటీసీ 2027 సైకిల్‌లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌ను ఆడలేదు.
IND vs AUS : మూడో వన్డేకు ముందు ఆసీస్ జట్టులో కీలక మార్పులు.. లబుషేన్ ఔట్.. ఆ ఇద్దరికి చోటు..
డబ్ల్యూటీసీ నిబంధనల ప్రకారం.. టెస్టు మ్యాచ్ గెలిచిన జట్టుకు 12 పాయింట్లు కేటాయిస్తారు. మ్యాచ్ డ్రా అయితే.. ఇరుజట్లకు నాలుగు పాయింట్లు, టై అయితే ఆరు పాయింట్లు కేటాయిస్తారు.
