×
Ad

Shubman Gill : వ‌న్డే కెప్టెన్ అయిన త‌రువాత.. తొలిసారి రోహిత్ శ‌ర్మ‌ను క‌లిసిన‌ గిల్‌.. ఏం చేశాడో చూడండి..

ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న కోసం శుభ్‌మ‌న్ గిల్ (Shubman Gill ) సార‌థ్యంలో భార‌త జ‌ట్టు బ‌య‌లుదేరింది.

Gill greets Rohit with handshake on first meeting as ODI captain

Shubman Gill : అక్టోబ‌ర్ 19 నుంచి భార‌త్, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం ఇప్ప‌టికే బీసీసీఐ భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించింది. సీనియ‌ర్ ఆట‌గాడు రోహిత్ శ‌ర్మ‌ను వ‌న్డే కెప్టెన్సీ నుంచి బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించింది. టెస్టు కెప్టెన్ అయిన శుభ్‌మ‌న్ గిల్‌(Shubman Gill)కు వ‌న్డే నాయ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించింది.

ఇక ఆస్ట్రేలియా వెళ్లేందుకు కొత్త కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌, సీనియ‌ర్ ఆట‌గాళ్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీలతో పాటు మిగిలిన‌ భార‌త‌ జ‌ట్టు బుధ‌వారం ఢిల్లీకి చేరుకుంది. హోట‌ల్ గ‌దిలో ఉన్న స‌మ‌యంలో ఓ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది.

Virat Kohli-Rohit Sharma : కోహ్లీ, రోహిత్ క‌లిసి ఆసీస్ గ‌డ్డ‌పై చ‌రిత్ర సృష్టించే గోల్డెన్ ఛాన్స్‌..

రోహిత్ శ‌ర్మ త‌న బ్యాగ్‌ను స‌ర్దుకుంటుండ‌గా.. కొత్త‌గా వ‌న్డే కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను చేప‌ట్టిన శుభ్‌మ‌న్ గిల్ వ‌చ్చి అత‌డిని ప‌ల‌కరించాడు. ఇద్ద‌రూ క‌ర‌చాల‌నం చేసుకున్నారు. ఆ త‌రువాత ఒక‌రినొక‌రు కౌగ‌లించుకున్నారు. ఆ త‌రువాత హోట‌ల్ నుంచి విమానాశ్ర‌యానికి వెళ్లేందుకు బ‌స్సు ఎక్కే స‌మ‌యంలో అప్ప‌టికే బ‌స్సులో కూర్చున్న విరాట్ కోహ్లీతో పాటు శ్రేయ‌స్ అయ్య‌ర్‌ల‌ను కూడా గిల్ ప‌ల‌క‌రించాడు.

Mohammed shami : ఐదు బంతుల్లో మూడు వికెట్లు.. సెలెక్ట‌ర్ల‌కు స‌వాల్ విసిరిన‌ ష‌మీ.. నా ఫిట్‌నెస్ ఇదీ..

ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ త‌మ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్ అవుతోంది. జట్టులోని ఆట‌గాళ్ల మ‌ధ్య ఎలాంటి అభిఫ్రాయ‌బేధాలు లేవ‌ని, సీనియ‌ర్లు.. గిల్ కు బాగా స‌హ‌క‌రిస్తున్నార‌ని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.