Glenn Maxwell pulls out of auction after 13 seasons in IPL
IPL : అబుదాబి వేదికగా డిసెంబర్ 16న ఐపీఎల్ 2026 మినీవేలం జరగనుంది. ఈ వేలం కోసం 1355 మంది ప్లేయర్లు రిజిస్టర్ చేసుకున్నారు. అయితే.. ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్‌మాక్స్‌వెల్ మాత్రం రిజిస్టర్ చేసుకోలేదు. 13 ఏళ్లుగా ఐపీఎల్ ఆడుతూ వచ్చిన మాక్స్‌వెల్ దాదాపు 92 కోట్లు ఈ లీగ్ ద్వారా సంపాదించాడు.
వేలంలో తన పేరును నమోదు చేసుకోలేదు అన్న విషయాన్ని మాక్స్‌వెల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఇదొక పెద్ద నిర్ణయం అని చెప్పుకొచ్చాడు. తాను ఓ మెరుగైన క్రికెటర్‌గా ఎదగడానికి ఐపీఎల్ ఎంతో సాయం చేసిందన్నాడు. ఇన్నాళ్లు తనకు మద్దతు ఇచ్చినందుకు ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు తెలియజేశాడు. అయితే.. తాను ఎందుకు ఈ ఏడాది వేలంలో తన పేరును నమోదు చేసుకోలేదు అన్న విషయాన్ని మాత్రం మాక్స్‌వెల్ వెల్లడించలేదు.
IND vs SA : రాయ్‌పుర్‌లో కోహ్లీని చుట్టుముట్టిన చిన్నారులు.. వీడియో వైరల్..
మాక్స్‌వెల్ తన ఐపీఎల్ (IPL) కెరీర్‌లో నాలుగు ఫ్రాంఛైజీల తరుపున ఆడాడు. 141 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 2819 పరుగులు సాధించాడు. 41 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2025 మెగావేలంలో మాక్స్‌వెల్ ను పంజాబ్ రూ.4.2 కోట్లకు కొనుగోలు చేసింది.
అయితే.. ఐపీఎల్ 2025 సీజన్‌లో మాక్సీ పెద్దగా ఆకట్టుకోలేదు. ఏడు మ్యాచ్‌ల్లో 48 పరుగులు మాత్రమే చేశాడు. గాయం కారణంగా అతడు సీజన్ మధ్యలోనే తప్పుకున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్ 2026 సీజన్ మినీ వేలానికి అతడిని పంజాబ్ వదిలివేసింది.