ధోని స్టైల్‌లో.. సంజూ శాంస‌న్ స్ట‌న్నింగ్ ర‌నౌట్ వీడియో

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కెప్టెన్ సంజూ శాంస‌న్ కూడా ధోని లాగే ప్ర‌త్య‌ర్థి బ్యాట‌ర్‌ను ర‌నౌట్ చేశాడు.

Sanju Samson : వికెట్ కీపింగ్‌లో ధోని స్టైలే వేరు. ముఖ్యంగా అత‌డు వికెట్ల‌ను చూడ‌కుండానే బంతిని విసిరి బెయిల్స్‌ ప‌డ‌గొట్టి ర‌నౌట్ చేయ‌డాన్ని ఎన్నో సార్లు చూశాం. అయితే ఎంతో మంది ధోనిలా ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ కూడా ఇందులో కొంద‌రు మాత్ర‌మే విజ‌యం సాధించారు. తాజాగా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కెప్టెన్ సంజూ శాంస‌న్ కూడా ధోని లాగే ప్ర‌త్య‌ర్థి బ్యాట‌ర్‌ను ర‌నౌట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

శ‌నివారం రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు పంజాబ్ కింగ్స్‌తో త‌ల‌ప‌డింది. పంజాబ్ ఇన్నింగ్స్ 18వ ఓవ‌ర్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ ఓవ‌ర్‌ను చాహ‌ల్ వేశాడు. ఐదో బంతిని పంజాబ్ బ్యాట‌ర్ అషుతోష్ శ‌ర్మ డీప్ మిడ్ వికెట్ దిశ‌గా ఆడాడు. మొద‌టి ప‌రుగు ఈజీగానే వ‌చ్చింది. రెండో ప‌రుగు కోసం ప్ర‌య‌త్నించారు. బంతి ఫీల్డ‌ర్ వ‌ద్ద‌కు వెళ్ల‌డంతో అషుతోష్ శ‌ర్మ వెన‌క్కి త‌గ్గ‌గా.. లివింగ్ స్టోన్ అప్ప‌టికే చాలా దూరం వ‌చ్చాడు.

Also Read: ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్.. కీలక ప్లేయర్ ఔట్.. కారణం ఏమిటంటే?

వెన‌క్కి మ‌ళ్లీ వికెట్ల వైపుగా ప‌రిగెత్తాడు. ఫీల్డ‌ర్ విసిరిన త్రో వికెట్ల‌కు కొంచెం దూరంలో రాగా.. చురుకుగా స్పందించిన సంజూశాంస‌న్ బంతిని అందుకుని వికెట్ల‌ను చూడ‌కుండానే హిట్ చేశాడు. అప్ప‌టికి లివింగ్ స్టోన్ క్రీజును చేర‌క‌పోవ‌డంతో ర‌నౌట్ అయ్యాడు. సంజూ శాంసన్ స్టన్నింగ్ రనౌట్‌‌కు అభిమానులు ఫిదా అయ్యారు. ఈ వీడియో వైర‌ల్‌గా మారింది.

మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 147 పరుగులు చేసింది. జితేశ్ శర్మ(24 బంతుల్లో 29), అషుతోష్ శర్మ(16 బంతుల్లో 31) రాణించారు. అనంత‌రం ల‌క్ష్యాన్ని రాజ‌స్థాన్ 19.5 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

Also Read: కారు వదిలి బస్సు నడిపిన రోహిత్ శర్మ.. సెల్ఫీలకోసం పోటీపడ్డ అభిమానులు.. ఫన్నీ వీడియో వైరల్

ట్రెండింగ్ వార్తలు