IPL 2024 : కారు వదిలి బస్సు నడిపిన రోహిత్ శర్మ.. సెల్ఫీలకోసం పోటీపడ్డ అభిమానులు.. ఫన్నీ వీడియో వైరల్

ముంబై జట్టు వరుస విజయాలతో ఐపీఎల్ 2024 టోర్నీలో స్పీడ్ పెంచింది. హార్ధిక్ సారథ్యంలో మొత్తం ఐదు మ్యాచ్ లు ఆడిన ముంబై జట్టు తొలి మూడు మ్యాచ్ లలో ఓడిపోయింది.. తరువాత వరుసగా ..

IPL 2024 : కారు వదిలి బస్సు నడిపిన రోహిత్ శర్మ.. సెల్ఫీలకోసం పోటీపడ్డ అభిమానులు.. ఫన్నీ వీడియో వైరల్

Rohit Sharma

Rohit Sharma : ఐపీఎల్ 2024 టోర్నీలో భాగంగా ఆదివారం రాత్రి ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. వాంఖడే స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్ కు ముందు ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు సంబంధించిన ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోహిత్ శర్మ ఎక్కడఉంటే అక్కడ సందడి వాతావరణం ఉంటుంది. డ్రెస్సింగ్ రూంలో, మైదానంలో ప్రాక్టీస్ సమయంలో తోటి ప్లేయర్స్ ను రోహిత్ ఆటపట్టిస్తుంటాడు. ఇందుకు సంబంధించిన ఫన్నీ వీడియోలు గతంలో అనేకం వెలుగులోకి వచ్చాయి. తాజాగా ముంబై ఇండియన్స్ జట్టు సభ్యులు ఎక్కిన బస్సును రోహిత్ శర్మ నడిపాడు. దీంతో రోహిత్ అభిమానులు సెల్ఫీ తీసుకొనేందుకు పోటీపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read : IPL 2024 : రాజస్థాన్ ఖాతాలో మరో విజయం.. 3 వికెట్ల తేడాతో పంజాబ్‌పై గెలుపు!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉంచిన బస్సును రోహిత్ డ్రైవ్ చేశాడు. ముంబై ఆటగాళ్లు బస్సులోకి ఎక్కగా.. రోహిత్ డ్రైవింగ్ సీటులో కూర్చొని బస్సును ముందుకు పోనిచ్చేందుకు ప్రయత్నించాడు.. ఈ సమయంలో అభిమానులు బస్సుకు ఎదురుగా సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డారు. తప్పుకోండి బస్సు వస్తుంది అన్నట్లుగా రోహిత్ సూచనలు చేయడం వీడియోలో కనిపించింది. బస్సులో ఉన్న ప్లేయర్స్ రోహిత్ బస్సు నడుపుతుండగా వీడియో తీస్తున్నట్లు వీడియోలో చూడొచ్చు. ఈ ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read : Suryakumar Yadav : చెన్నైతో మ్యాచ్‌కు ముందు కెమెరాను బ‌ద్ద‌లు కొట్టిన సూర్య‌కుమార్ యాద‌వ్‌

ముంబై జట్టు వరుస విజయాలతో ఐపీఎల్ 2024 టోర్నీలో స్పీడ్ పెంచింది. హార్ధిక్ సారథ్యంలో మొత్తం ఐదు మ్యాచ్ లు ఆడిన ముంబై జట్టు.. తొలి మూడు మ్యాచ్ లలో ఓడిపోయింది.. తరువాత వరుసగా రెండు మ్యాచ్ లలో విజయం సాధించింది. ఆదివారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించేందుకు హార్దిక్ సేన సన్నద్ధమవుతోంది.