Babar Azam : పాక్ కెప్టెన్ బాబ‌ర్ ఆజాంకు గోల్డెన్ ఛాన్స్‌.. ఇప్పుడు మిస్సైతే..

పాకిస్తాన్ కెప్టెన్ బాబ‌ర్ ఆజాం ఎదుట అద్భుత అవ‌కాశం ఉంది

Babar Azam – Virat Kohli : పాకిస్తాన్ కెప్టెన్ బాబ‌ర్ ఆజాం ఎదుట అద్భుత అవ‌కాశం ఉంది. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు ముందే పొట్టి ఫార్మాట్‌లో అత్య‌ధిక ప‌రుగులు సాధించిన ఆట‌గాడిగా నిలిచే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం అంత‌ర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో అత్య‌ధిక ప‌రుగులు సాధించిన ఆట‌గాళ్ల జాబితాలో బాబ‌ర్ మూడో స్థానంలో కొన‌సాగుతున్నాడు. ఈ జాబితాలో ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి అగ్ర‌స్థానంలో ఉన్నారు.

వీరిద్ద‌రి మ‌ధ్య అంత‌రం 339 ప‌రుగులు మాత్ర‌మే. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ముందు పాకిస్తాన్ జ‌ట్టు 12 టీ20 మ్యాచులు ఆడ‌నుంది. ఈ మ్యాచుల్లో అత‌డు రాణిస్తే కోహ్లి రికార్డును బ్రేక్ చేయ‌డం అత‌డికి పెద్ద క‌ష్ట‌మేమీ కాదు. బాబ‌ర్ ఇప్ప‌టి వ‌ర‌కు 103 ఇన్నింగ్స్‌ల్లో 41.5 స‌గ‌టుతో 3698 ప‌రుగులు చేశాడు. ఇందులో మూడు శ‌త‌కాలు, 33 అర్ధ‌శ‌త‌కాలు ఉన్నాయి. అటు కోహ్లి 109 ఇన్నింగ్స్‌ల్లో 51.8 స‌గ‌టుతో 4037 ప‌రుగులు చేశాడు. ఇందులో ఓ శ‌క‌తం, 37 అర్ధ‌శ‌త‌కాలు ఉన్నాయి.

Rohit Sharma : చెన్నైపై ఓట‌మి.. బాధ‌తో ఒంటరిగా డ్రెస్సింగ్ రూమ్‌కు రోహిత్ శ‌ర్మ‌..

అంత‌ర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆట‌గాళ్లు..

విరాట్ కోహ్లీ (భార‌త్‌) – 109 ఇన్నింగ్స్‌ల్లో 4037 పరుగులు
రోహిత్ శర్మ(భార‌త్‌) – 143 ఇన్నింగ్స్‌ల్లో 3974 ప‌రుగులు
బాబర్ ఆజం (పాకిస్తాన్‌) – 103 ఇన్నింగ్స్‌ల్లో 3698 ప‌రుగులు
మార్టిన్ గప్టిల్ (న్యూజిలాండ్‌) – 118 ఇన్నింగ్స్‌ల్లో 3531 ప‌రుగులు
పాల్ స్టిర్లింగ్ (ఐర్లాండ్‌) – 136 ఇన్నింగ్స్‌ల్లో 3491 ప‌రుగులు

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ముందు పాకిస్తాన్ బీజీ షెడ్యూల్‌ను క‌లిగి ఉంది. ఏప్రిల్ 18 నుంచి న్యూజిలాండ్‌తో 5 మ్యాచుల టీ20 సిరీస్ ఆడ‌నుంది. ఆ త‌రువాత ఐర్లాండ్‌తో 3 మ్యాచుల టీ20 సిరీస్ ఆడ‌నున్నారు. అనంత‌రం ఇంగ్లాండ్‌తో 4 మ్యాచుల టీ20 సిరీస్ ఆడ‌నున్నారు. కాగా.. భార‌త ఆట‌గాడు కోహ్లి ఐపీఎల్‌తో బిజీగా ఉన్నాడు. కాబ‌ట్టి కోహ్లిని అధిగ‌మించేందుకు బాబ‌ర్‌కు ఇదే స‌రైన స‌మయం అని క్రీడా విశ్లేష‌కులు అంటున్నారు.

RCB vs SRH Match Prediction : హ్యాట్రిక్ విజ‌యాల‌పై స‌న్‌రైజ‌ర్స్ క‌న్ను.. ఓడితే ప్లే ఆఫ్స్ రేసు నుంచి బెంగ‌ళూరు ఔట్‌

ట్రెండింగ్ వార్తలు