WPL Auction 2024 : ప్రారంభ‌మైన డ‌బ్ల్యూపీఎల్ మినీవేలం.. భారీ ధ‌ర‌కు అమ్ముడైన ఆసీస్ ప్లేయ‌ర్

WPL Auction : క్రికెట్ ప్రేమికులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్‌(డ‌బ్ల్యూపీఎల్‌) 2024 వేలం మొద‌లైంది.

Phoebe Litchfield

WPL Auction : క్రికెట్ ప్రేమికులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్‌(డ‌బ్ల్యూపీఎల్‌) 2024 వేలం మొద‌లైంది. ఐదు ప్రాంఛైజీల్లో 30 ఖాళీలు ఉండ‌గా 165 మంది ప్లేయ‌ర్లు పోటీప‌డుతున్నారు. వీరిలో ఎవ‌రిని ఏ ఫ్రాంచైజీ ద‌క్కించుకుంటుందోన‌ని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ముంబైలో శ‌నివారం బీసీసీఐ అధ్య‌క్షుడు, డ‌బ్ల్యూపీఎల్ ఛైర్ ప‌ర్స‌న్ రోజ‌ర్ బిన్ని వేలం ప్ర‌క్రియ‌ను ప్రారంభించారు. అనంత‌రం వ్యాఖ్యాత మ‌ల్లికా సాగ‌ర్ ఆస్ట్రేలియా స్టార్ ప్లేయ‌ర్ లిచ్‌ఫీల్డ్ పేరుతో వేలం మొద‌లెట్టింది.

రూ.30 ల‌క్ష‌ల క‌నీస ధ‌ర‌తో లిచ్‌ఫీల్డ్ వేలం కోసం న‌మోదు చేసుకుంది. ఆమె కోసం గుజ‌రాత్ జెయింట్స్‌, వారియర్జ్ పోటీ ప‌డ్డాయి. ఆఖ‌ర‌కు గుజ‌రాత్ జెయింట్స్ రూ.కోటికి ఆమెను సొంతం చేసుకుంది. ఈ వేలంలో అమ్ముడైన మొద‌టి ప్లేయ‌ర్‌గా లిచ్‌ఫీల్డ్ నిలిచింది.

BAN vs NZ 2nd Test : ప్ర‌తీకారం తీర్చుకున్న న్యూజిలాండ్‌.. రెండో టెస్టులో బంగ్లాదేశ్ పై విజ‌యం..

2023 సీజన్‌లో చివరి స్థానంలో నిలిచిన గుజరాత్ జెయింట్స్ 11 మంది ప్లేయ‌ర్ల‌ను విడుదల చేసి రూ. 5.95 కోట్ల అతిపెద్ద పర్స్‌తో వేలంలోకి వచ్చింది. 3.35 కోట్ల బడ్జెట్‌తో వ‌చ్చిన ఆర్‌సీబీకి 7 స్లాట్‌లు ఉన్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్లు ముంబై, యుపి వారియర్జ్ రెండు జ‌ట్లు ఒక్కొక్కటి ఐదు స్లాట్‌లను కలిగి ఉన్నాయి. ముంబై వేలం పర్స్‌ రూ. 2.1 కోట్లు, యూపీ వేలం ప‌ర్సులో రూ.4 కోట్లు ఉన్నాయి.

ఢిల్లీ కేవలం ముగ్గురు ఆటగాళ్లను మాత్రమే విడుదల చేసి రూ.2.25 కోట్లతో వేలంలోకి వచ్చింది. అన్ని జట్లూ సీజన్‌లో గరిష్టంగా 18 మంది ఆటగాళ్ల జాబితాను కలిగి ఉండొచ్చు. కాగా.. వేలం మొత్తం పర్స్ క్యాప్ రూ. 13.5 కోట్లు.గా ఉంది.

Abu Dhabi T10 League : టీ10 క్రికెట్‌లో పెను సంచ‌ల‌నం.. మొద‌టి ఓవ‌ర్‌లోనే హ్యాట్రిక్.. 6 ప‌రుగులిచ్చి 5 వికెట్లు..

ట్రెండింగ్ వార్తలు