Gujarat Giants confirm Ashleigh Gardner as captain for WPL 2026
Gujarat Giants : జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5 వరకు మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 జరగనుంది. ఈ నాలుగో సీజన్‌కు అన్ని ఫ్రాంఛైజీలు సిద్ధం అవుతున్నాయి. అందులో భాగంగా గుజరాత్ జెయింట్స్ తమ కెప్టెన్‌ను ప్రకటించింది. ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ ఆష్లీ గార్డనర్ ను తమ కెప్టెన్‌గా ప్రకటించింది.
డబ్ల్యూపీఎల్ 2025 సీజన్‌లోనూ గుజరాత్ కెప్టెన్‌గా ఆష్లీనే ఉంది. ఆ సీజన్‌లో ఎనిమిది మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో మూడో స్థానంలో గుజరాత్ నిలిచింది. గుజరాత్ జెయింట్స్‌లో అత్యుత్తమ ప్లేయర్లలో ఆమె ఒకరిగా ఉంది. ఇప్పటి వరకు డబ్ల్యూపీఎల్‌లో ఆష్లీ 25 ఇన్నింగ్స్‌ల్లో 141.75 స్ట్రైక్‌రేటుతో 567 పరుగులు సాధించింది. అంతేకాదండోయ్ బౌలింగ్‌లో 25 వికెట్లు పడగొట్టింది.
డబ్ల్యూపీఎల్ 2026లో గుజరాత్ జెయింట్స్ తమ తొలి మ్యాచ్‌లో యూపీతో జనవరి 10న తలపడనుంది.
డబ్ల్యూపీఎల్ 2026 కోసం గుజరాత్ జెయింట్స్ జట్టు ఇదే..
ఆష్లీ గార్డనర్ (కెప్టెన్), భారతీ ఫుల్‌మాలి, డేనియల్ వ్యాట్-హాడ్జ్, కనికా అహుజా, సోఫీ డివైన్, కష్వీ గౌతమ్, కిమ్ గార్త్, అనుష్క శర్మ , ఆయుషి సోని, యాస్తికా భాటియా,బెత్ మూనీ, శివన్ సింగ్, రాజేశ్వరి గయాక్వాడ్, తనూజా కన్వర్, రేణుకా సింగ్ ఠాకూర్, టిటాస్ సాధు, జార్జియా వేర్‌హామ్, హ్యాపీ కుమారి