Gujarat Titans win (pic IPL Twitter)
IPL 2023, GT vs LSG: అహ్మదాబాద్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) అదరగొట్టింది. 56 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. లక్ష్య ఛేదనలో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులకే పరిమితమైంది. లక్నో బ్యాటర్లలో క్వింటన్ డికాక్(70; 41 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) దంచికొట్టగా కైల్ మేయర్(48; 32బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. దీపక్ హుడా(11), స్టోయినిస్(4), నికోలస్ పూరన్(3), కృనాల్ పాండ్యా(0)లు విఫలం అయ్యారు. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ నాలుగు వికెట్లు తీయగా, మహ్మద్ షమీ, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ ఒక్కొ వికెట్ పడగొట్టారు.
IPL 2023, GT vs LSG : లక్నో పై గుజరాత్ ఘన విజయం
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్( 94నాటౌట్; 51 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లు), వృద్ధిమాన్ సాహా(81; 43 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు) లు ధంచికొట్టగా హార్ధిక్ పాండ్యా(25; 15 బంతుల్లో 1 పోర్, 2 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్(21 నాటౌట్; 12 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. లక్నో బౌలర్లలో మొహ్సిన్ ఖాన్, అవేష్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు.