Gujarath Announces 3 Crores Prize Money For Bhavina Ben Patel
Paralympics Silver medalist Bhavina ben patel : టోక్యో పారా ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న సిల్వర్ మెడల్ విజేత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనా పటేల్‌కు గుజరాత్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఆమెకు అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని దివ్యాంగ్ ఖేల్ ప్రతిభా ప్రోత్సాహన్ పురస్కార్ యోజన కింద భవీనా పటేల్‌కు రూ.3 కోట్లు ప్రైజ్ మనీని ప్రకటించింది. గుజరాత్‌లోని వాడ్‌నగర్ భవీనా స్వస్థలం. 12 నెలల వయస్సుల్లోనే పోలియో బారిన పడింది. అయినా ఏమాత్రం అధైర్యపడలేదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగింది.. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.
అదే సమయంలో టేబుల్ టెన్నిస్ ఆడటం ప్రారంభించింది. అంతర్జాతీయ టోర్నీల్లో అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్లింది భవీనా.. ఇప్పటివరకూ ఆమె 13 సిల్వర్ మెడల్స్, 5 గోల్డ్ మెడల్స్ సాధించింది. తొలి పారాలింపిక్స్‌లో సిల్వర్ పతకాన్ని సాధించి అందరి మనస్సులను గెలుచుకుంది. మరోవైపు.. టోక్యో పారాలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన భవీనా పటేల్ స్వస్థలమైన మెహసానా పట్టణంలో పెద్దఎత్తునా సంబురాలు జరిగాయి.
Tokyo Paralympics: టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం.. చరిత్రలో తొలిసారి
ఆమె కుటుంబసభ్యులు, స్నేహితులు, ఇరుగుపొరుగు వారంతా కలిసి పండుగలా జరుపుకున్నారు. స్వీట్లు పంచుకున్నారు. పటాకులు పేల్చారు.. గుజరాతీ సంప్రదాయ నృత్యమైన గార్బా డ్యాన్స్‌తో సంబురాలు జరిపారు. భవీనా తల్లిదండ్రులతోపాటు, స్నేహితులంతా డాన్యులు చేస్తూ సందడి చేశారు. తమ కూతురు తామంతా గర్వపడేలా చేసిందని భవీనా తండ్రి హస్ముఖ్‌భాయ్ పటేల్ సంతోషం వ్యక్తం చేశారు.
#WATCH Family members and friends of Para-paddler Bhavina Patel in Mehsana perform ‘garba’ to celebrate her bringing home a Silver medal in her maiden Paralympic Games pic.twitter.com/h55CAAycOG
— ANI (@ANI) August 29, 2021