Asian Games 2022 : కరోనా సంక్షోభం.. ఆసియా క్రీడలు ఇప్పట్లో లేనట్టే..?

Asian Games 2022 : చైనాలో కరోనా సంక్షోభం వెంటాడుతోంది. రోజురోజుకీ కరోనా కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి.

Asian Games 2022 : చైనాలో కరోనా సంక్షోభం వెంటాడుతోంది. రోజురోజుకీ కరోనా కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి కోసం చైనా కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్లు విధిస్తోంది. చైనాలో అతిపెద్ద నగరమైన షాంఘైలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి. దాంతో అక్కడి ప్రభుత్వం రెండు వారాల పాటు లాక్ డౌన్ విధించింది. ఈ నేపథ్యంలో చైనాలో ఆసియా క్రీడలు 2022 వాయిదా పడ్డాయి. ఈ క్రీడలను నిరవధికంగా వాయిదా వేసినట్టు చైనా మీడియా వెల్లడించింది. షెడ్యూల్ ప్రకారం.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో హాంగ్‌జౌలో ఆసియా క్రీడలు జరగాల్సి ఉంది. అయితే, ఈ గేమ్స్ ప్రస్తుతం వాయిదా పడినట్టు తెలుస్తోంది. మళ్లీ ఎప్పుడూ ఆసియా క్రీడలను నిర్వహిస్తారనేది క్లారిటీ లేదు. ఆసియా క్రీడల నిర్వహణ విషయంలో ఎదురైన సమస్యలకు సంబంధించి కారణాలను కూడా నిర్వాహకులు ఎవరూ అధికారికంగా ప్రకటించలేదు. చైనాలో కరోనా సంక్షోభం దృష్ట్యా ఆసియా క్రీడలు వాయిదా పడినట్టు తెలుస్తోంది.

“ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా 19వ ఆసియా క్రీడలను చైనాలోని హాంగ్‌జౌలో సెప్టెంబర్ 10 నుంచి 25 వరకు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఆసియా క్రీడలను నిర్వహించేది లేదని ప్రకటించినట్టు చైనా మీడియాలో కథనాలు వచ్చాయి. మళ్లీ ఎప్పుడూ ఆసియా క్రీడలను నిర్వహిస్తారు అనేది ఇంకా వెల్లడించలేదు. కొత్త తేదీలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.

ఆసియా క్రీడలకు వేదికైన హాంగ్‌జౌలో కరోనా కేసుల దృష్ట్యా రెండు వారాల లాక్ డౌన్ అమల్లో ఉంది. షాంఘై సమీపంలోనే ఈ నగరం ఉండటంతో కరోనా కట్టడిలో భాగంగా అక్కడి ప్రభుత్వం ఈ నగరంలోనూ లాక్ డౌన్ విధించింది. మొత్తంగా 56 క్రీడా వేదికలు కలిగిన హాంగ్‌జౌలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ పూర్తి చేసినట్టు నిర్వాహకులు వెల్లడించారు. ఆసియా క్రీడల తర్వాత ఆసియా పారా గేమ్స్ సైతం ఇక్కడే నిర్వహించనున్నారు. ఈ ఏడాదిలో ఆసియా క్రీడలలో 40 క్రీడలను చేర్చగా.. ఈ 40 క్రీడల్లో మహిళలు, పురుషులు వేర్వేరు విభాగాల్లో మొత్తం 61 ఈవెంట్లను నిర్వహించనున్నారు.

Read Also : Sourav Ganguly: గంగూలీ ఇంటికి అమిత్ షా.. బీజేపీలో చేరుతారా? 

ట్రెండింగ్ వార్తలు