Sourav Ganguly: గంగూలీ ఇంటికి అమిత్ షా.. బీజేపీలో చేరుతారా?

మాజీ క్రికెటర్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కేంద్ర హోం మత్రి అమిత్ షాకు తన ఇంట్లో ఆతిథ్యం ఇవ్వబోతున్నట్లు సమాచారం. శుక్రవారం సాయంత్రం కోల్‌కతాలోని తన నివాసంలో అమిత్ షాకు ఆతిథ్యం ఇవ్వబోతున్నారు.

Sourav Ganguly: గంగూలీ ఇంటికి అమిత్ షా.. బీజేపీలో చేరుతారా?

Sourav Ganguly

Sourav Ganguly: మాజీ క్రికెటర్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కేంద్ర హోం మత్రి అమిత్ షాకు తన ఇంట్లో ఆతిథ్యం ఇవ్వబోతున్నట్లు సమాచారం. శుక్రవారం సాయంత్రం కోల్‌కతాలోని తన నివాసంలో అమిత్ షాకు ఆతిథ్యం ఇవ్వబోతున్నారు. దీంతో సౌరవ్ గంగూలీ, అమిత్ షా కలయిక రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. గంగూలీ బీజేపీలో చేరుతారా? అనే అంశంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. నిజానికి గంగూలీని బీజేపీలోకి తేవాలని ఆ పార్టీ ఎప్పట్నుంచో ప్రయత్నిస్తోంది. గత ఏడాది పశ్చిమ బెంగాల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, ఆయనను పార్టీలోకి తేవాలని బీజేపీ ప్రయత్నించింది. బెంగాల్‌లో బీజేపీ గెలిస్తే ముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వాలనుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, ఆ సమయంలో గంగూలీ పార్టీలో చేరలేదు.

west bengal: బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన కోరుతున్న లాయర్లు.. ఎందుకంటే!

గంగూలీ, అమిత్ షాల తాజా భేటీకి కారణం ఉంది. గంగూలీ భార్య డోనా గంగూలీ, శుక్రవారం కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్న ఒక కార్యక్రమంలో నాట్యం చేయబోతుంది. దీనికి అమిత్ షా హాజరవుతారు. ఈ కార్యక్రమం అనంతరం అమిత్ షా, గంగూలీ నివాసానికి వెళ్తారు. అమిత్ షాతోపాటు పలువురు బెంగాల్ బీజేపీ నేతలు కూడా గంగూలీ నివాసానికి వెళ్లనున్నారు. గంగూలీ అటు కేంద్రంలో బీజేపీతో, రాష్ట్రంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో సమానంగా సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు.