Harbhajan Singh: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేసిన హర్భజన్‌సింగ్‌

క్రికెట్ ప్రపంచంలో టర్బొనేటర్‌గా పేరొందిన హర్భజన్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు.

Harbhajan Singh: క్రికెట్ ప్రపంచంలో టర్బొనేటర్‌గా పేరొందిన హర్భజన్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. ఈ వెటరన్ ఆఫ్ స్పిన్నర్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ద్వారా క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. దీంతో భజ్జీ 23 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌ను ముగించినట్లుగా అయ్యింది.

41 ఏళ్ల హర్భజన్ సింగ్, “అన్ని మంచి విషయాలు ముగిశాయి. ఈరోజు నాకు అన్నింటినీ అందించిన ఆటకు వీడ్కోలు పలుకుతున్నాను. 23ఏళ్ల నా కెరీర్‌లో భాగస్వామ్యమైన వారందరికీ ధన్యవాదాలు.”. My heartfelt thank you..Grateful అంటూ రాసుకొచ్చారు.

ఐదేళ్ల క్రితమే చివరి అంతర్జాతీయ మ్యాచ్:
హర్భజన్ సింగ్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను మార్చి 2016లో ఆడాడు. ఈ టీ20 మ్యాచ్‌లో భజ్జీ నాలుగు ఓవర్లలో ఒక మెయిడిన్‌తో కేవలం 11 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. అదే సమయంలో, అతను అక్టోబర్ 2015లో చివరి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ మరియు ఆగస్ట్ 2015లో చివరి టెస్ట్ ఆడాడు.

1998లో అరంగేట్రం
భజ్జీ అంతర్జాతీయ కెరీర్ విషయానికి వస్తే, 1998లో భారత్‌ తరపున అరంగేట్రం చేశాడు. భారత్ తరఫున 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 417 వికెట్లు, వన్డేల్లో 269, టీ20ల్లో 25 వికెట్లు తీశాడు.

హర్భజన్ సింగ్ అంతర్జాతీయ కెరీర్:

మొత్తం టెస్టులు: 103, వికెట్లు: 417
మొత్తం ODI: 236, వికెట్: 269
మొత్తం T20: 28, వికెట్: 25

హర్భజన్ సింగ్ మొదటి, చివరి మ్యాచ్:

1వ టెస్టు: Vs ఆస్ట్రేలియా, 1998
చివరి టెస్టు: Vs శ్రీలంక, 2015

1వ ODI: vs న్యూజిలాండ్, 1998
చివరి ODI: vs సౌతాఫ్రికా, 2015

1వ T20: vs దక్షిణాఫ్రికా, 2006
చివరి T20: vs UAE, 2016

ఐపీఎల్ కెరీర్:
మొత్తం మ్యాచ్‌లు: 163, వికెట్లు: 150

ట్రెండింగ్ వార్తలు