Harbhajan Singh On team selection: ఈ ముగ్గురిని ఆసియా కప్‌కు ఎందుకు ఎంపిక చేయలేదు?: టీమిండియా ఓటమిపై హర్భజన్

‘‘150 స్పీడ్ తో బంతిని విసిరే ఉమ్రాన్ మాలిక్ ఎక్కడ? దీపక్ చాహర్ ను ఎందుకు తీసుకోలేదు? వీరికి మ్యాచులో ఆడే అర్హత లేదా? దినేశ్ కార్తీక్ కు ఎందుకు అవకాశాలు దక్కడం లేదు? ఈ తీరు అసంతృప్తికి గురిచేస్తోంది’’ అని హర్భజన్ సింగ్ అన్నారు. కాగా, నిన్న ఆసియా కప్ లో భాగంగా జరిగిన భారత్-శ్రీలంక మ్యాచులో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే.

Harbhajan Singh On team selection: ఆసియా కప్ ఫైనల్ రేసులో నిలవాలంటే తప్పకగెలవాల్సిన మ్యాచులో శ్రీలంక చేతిలో టీమిండియా ఓడడంతో భారత జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ విమర్శలు గుప్పించారు. జమ్మూకశ్మీర్ పేసర్ ఉమ్రాన్ మాలిక్, పేసర్ దీపక్ చాహర్, వికెట్ కీపర్-బ్యాటర్ దినేశ్ కార్తీక్‌ను ఎందుకు జట్టులోకి తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. ‘‘150 స్పీడ్ తో బంతిని విసిరే ఉమ్రాన్ మాలిక్ ఎక్కడ? దీపక్ చాహర్ ను ఎందుకు తీసుకోలేదు? వీరికి మ్యాచులో ఆడే అర్హత లేదా? దినేశ్ కార్తీక్ కు ఎందుకు అవకాశాలు దక్కడం లేదు? ఈ తీరు అసంతృప్తికి గురిచేస్తోంది’’ అని హర్భజన్ సింగ్ అన్నారు.

కాగా, నిన్న ఆసియా కప్ లో భాగంగా జరిగిన భారత్-శ్రీలంక మ్యాచులో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. రోహిత్‌ శర్మ 72 పరుగులతో రాణించడంతో టీమిండియా 8 వికెట్లకు 173 పరుగులు చేయగలిగింది. అయితే, టీమిండియా ఇచ్చిన 174 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక ఛేదించింది. అంతకు ముందు జరిగిన మ్యాచ్ లోనూ పాక్‌ చేతిలో భారత్ ఓడిపోయింది. దీంతో ఫైనల్ వెళ్ళే ఆశలు సన్నగిల్లాయి.

Woman bites fingers: టీవీ సౌండు తగ్గించాలని చెప్పినందుకు అత్త చేతి మూడు వేళ్ళు కొరికేసిన కోడలు

ట్రెండింగ్ వార్తలు