IND vs BAN T20: వావ్.. హార్దిక్ పాండ్యా ఎంత తేలిగ్గా సిక్స్ కొట్టాడో చూశారా.. వీడియో వైరల్

హార్దిక్ పాండ్యా బౌలింగ్ లోనూ, బ్యాటింగ్ లో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. బౌలింగ్ లో నాలుగు ఓవర్లు వేసి ఒక వికెట్ పడగొట్టిన హార్దిక్.. బ్యాటింగ్ లో రెచ్చిపోయాడు.

Hardik Pandya

Hardik Pandya: టెస్టు సిరీస్ లో బంగ్లాదేశ్ ను మట్టికరిపించిన టీమిండియాకు టీ20 సిరీస్ లోనూ అదిరే ఆరంభం దక్కింది. కొందరు కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చినా తొలి మ్యాచ్ లో భారత్ దంచికొట్టింది. టీమిండియా ప్లేయర్స్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టారు. ముఖ్యంగా హార్ధిక్ పాండ్య ఆల్ రౌండ్ ప్రదర్శనతో సత్తాచాటాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు 19.5 ఓవర్లకు 127 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా కేవలం 11.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించి విజయదుందుబి మోగించింది. ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా స్టైలిష్ గా కొట్టిన సిక్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సిక్స్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతుంది.

Also Read: IND vs BAN: తెలుగు క్రికెటర్ నితీశ్ రెడ్డి పేరుమార్చుకున్నారా.. బీసీసీఐ తప్పు చేసిందా?

హార్దిక్ పాండ్యా బౌలింగ్ లోనూ, బ్యాటింగ్ లో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. బౌలింగ్ లో నాలుగు ఓవర్లు వేసి ఒక వికెట్ పడగొట్టిన హార్దిక్.. బ్యాటింగ్ లో రెచ్చిపోయాడు. వరుస సిక్సులు, ఫోర్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో హార్దిక్ కొట్టిన ఓ సిక్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. చివరిలో బంగ్లా బౌలర్ బాల్ ను బౌన్స్ చేయడంతో హార్దిక్ పాండ్యా దానిని చాకచక్యంగా ఆడి సిక్స్ గా మలిచాడు. ఈ క్రమంలో ఇలాంటి సిక్సులు గతంలో నేను ఎన్నోకొట్టేశా అన్నట్లుగా హార్దిక్ ఎక్స్‌ప్రెష‌న్స్‌ ఇచ్చాడు. ఆ తరువాత బంతిని బలంగా కొట్టే క్రమంలో హార్ధిక్ చేతిలో నుంచి బ్యాట్ జారిపోయి థర్డ్ అంపైర్ కు దగ్గరలో పడింది. మొత్తానికి హార్దిక్ పాండ్యా చాన్నాళ్ల తరువాత సిక్సులు, ఫోర్లతో సూపర్ బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో 39 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.