IND vs BAN: తెలుగు క్రికెటర్ నితీశ్ రెడ్డి పేరుమార్చుకున్నారా.. బీసీసీఐ తప్పు చేసిందా?
నితీశ్ రెడ్డి జెర్సీ పొరపాటు జరిగినా తన అంతర్జాతీయ అరంగేట్రం మ్యాచ్ లో అద్భుతంగా రాణించాడు. రెండు ఓవర్లు బౌలింగ్ వేసి 17 పరుగులు ఇచ్చిన నితీశ్.. నాల్గో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి ..

Nitish Kumar Reddy
IND vs BAN 1st T20: మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఆదివారం రాత్రి ఇండియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ సునాయాస విజయాన్ని దక్కించుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా జట్లు 19.5 ఓవర్లకు 127 పరుగులకే ఆలౌట్ అయింది. 128 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా బ్యాటర్లు మొదటి నుంచి దూకుడుగా ఆడారు. దీంతో భారత్ జట్టు కేవలం 11.5 ఓవర్లలోనే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. అర్ష్ దీప్ సింగ్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యం సంపాదించింది. రెండో మ్యాచ్ బుధవారం ఢిల్లీలో జరగనుంది. ఇదిలాఉంటే.. ఆదివారం జరిగిన మ్యాచ్ లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
Also Read : CM Yogi Adityanath : గ్రౌండ్‌లోకి దిగి బ్యాట్‌పట్టిన యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్.. వీడియో వైరల్
ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్ ద్వారా తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అయితే, నితీశ్ కు సంబంధించిన ఓ విషయం ఆసక్తికరంగా మారింది. నితీశ్ ధరించిన జెర్సీపై నితేశ్ అని రాసిఉంది. దీంతో అతను పేరు మార్చుకున్నారా ..? బహుశా బీసీసీఐకు చెందిన లాజిస్టిక్స్ టీం నితీశ్ పేరును తప్పుగా ముద్రించిందా అనే అంశం చర్చనీయాంశంగా మారింది. అడిడాస్ కంపెనీ భారత క్రికెట్ జట్టు కిట్లు, జెర్సీలను తయారు చేస్తోంది. నితీశ్ పేరును నితేశ్ అని తయారీ కంపెనీ కూడా తప్పు ముద్రించినట్లు తెలుస్తోంది. బుధవారం జరిగే రెండో టీ20 మ్యాచ్ లో నితీశ్ జెర్సీపై పేరును సరిచేస్తారా.. అలానే ఉంచుతారా అనేది చూడాల్సి ఉంది.
నితీశ్ రెడ్డి జెర్సీ పొరపాటు జరిగినా తన అంతర్జాతీయ అరంగేట్రం మ్యాచ్ లో అద్భుతంగా రాణించాడు. రెండు ఓవర్లు బౌలింగ్ వేసి 17 పరుగులు ఇచ్చిన నితీశ్.. నాల్గో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి 15 బంతుల్లో 16 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
Nitesh reddy na 😍 https://t.co/s5vVLFWeWr
— RavaliJaanu🤍🩷 (@Ravalijaanu) October 6, 2024