CM Yogi Adityanath : గ్రౌండ్‌లోకి దిగి బ్యాట్‌ప‌ట్టిన యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్.. వీడియో వైరల్

సీఎం యోగి ఆధిత్యనాథ్ ఈ కార్యక్రమంకు సంబంధించిన ఫొటోను తన అధికారిక ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

CM Yogi Adityanath : గ్రౌండ్‌లోకి దిగి బ్యాట్‌ప‌ట్టిన యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్.. వీడియో వైరల్

Yogi Adityanath

Updated On : October 7, 2024 / 7:24 AM IST

CM Yogi Playing Cricket: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా నిత్యం బిజీబిజీగా గడిపే యోగి ఆదిత్యనాథ్ కాస్త రిలాక్స్ అయ్యారు. మైదానంలోకి దిగి బ్యాట్ పట్టారు. సూపర్ షాట్ లతో అదరగొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లక్నోలో అఖిల భారత అడ్వకేట్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో యోగి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారితో కలిసి కొద్దిసేపు క్రికెట్ ఆడారు.

Also Read : PAKW Vs INDW: పాకిస్థాన్‌పై టీమిండియా విజయ దుందుభి

సీఎం యోగి ఆధిత్యనాథ్ ఈ కార్యక్రమంకు సంబంధించిన ఫొటోను తన అధికారిక ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈరోజు లక్నోలో నిర్వహించిన 36వ ఆల్ ఇండియా అడ్వకేట్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నాను. గత పదేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో దేశంలో క్రీడా కార్యకలాపాలు విస్తరించాయి. నరేంద్ర మోదీ ఖేల్ ఇండియా, ఫిట్ ఇండియా ఉద్యమం, సంసద్ క్రీడా పోటీలు దీనికి నిదర్శనం. పోటీల్లో పాల్గొనే అన్ని జట్లకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు అని ఆధిత్యనాథ్ పేర్కొన్నారు.