నేను వచ్చేశా..! టీమిండియా సభ్యులతో ప్రాక్టీస్ సెష‌న్‌లో హార్దిక్ పాండ్యా.. ఫొటోలు వైరల్

హార్దిక్ పాండ్యా న్యూయార్క్ చేరుకొని టీమిండియా సభ్యులతో కలిసి ప్రాక్టీస్ సెషన్ పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ట్విటర్, ఇన్ స్టాగ్రామ్ ఖాతాల్లో హార్దిక్ షేర్ చేశారు.

Hardik Pandya : టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా గత కొద్దిరోజులుగా నిత్యం వార్తల్లో వ్యక్తిగా మారుతున్నారు. సోషల్ మీడియాలోనూ హార్దికపై విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం నుంచి ఏదోఒక విషయంపై హార్దిక్ పాండ్యా నెటిజన్ల నుంచి ట్రోల్స్ కు గురవుతున్నాడు. ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్సీ విషయంలో, ఆ తరువాత టోర్నీలో ముంబై జట్టు ఘోరంగా వైఫల్యం చెందిన విషయంలోనూ హార్దిక్ సోషల్ మీడియా వేదికల్లో ట్రోల్స్ కు గురయ్యాడు. ఈ క్రమంలోనే భార్య నటాషాతో హార్డిక్ విడాకుల రూమర్స్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Also Read : Rishabh Pant : రెండు నెల‌లు బ్ర‌ష్ చేసుకోలేక‌పోయా.. కారు ప్ర‌మాదం త‌రువాత ఏడు నెల‌లు న‌ర‌కం

హార్దిక్ పాండ్యాకు 2024 సంవత్సరం కలిసి రావడం లేదని చెప్పొచ్చు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా, ప్లేయర్ గా ఐపీఎల్ 2024లో ఘోరంగా విఫలమయ్యాడు. ఆ తరువాత భార్య నటాషాతో విడాకుల రూమర్స్ తో నిత్యం వార్తల్లో వ్యక్తిగా హార్దిక్ మారిపోయాడు. ఈ క్రమంలో అతను టీ20 వరల్డ్ కప్ జట్టులో ఆడేది అనుమానమేనని తొలుత వార్తలు వ చ్చాయి. దీనికితోడు టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియా జట్టు సభ్యులు న్యూయార్క్ చేరుకున్నారు. వారిలో హార్దిక్ పాండ్యాలు లేరు. దీంతో హార్దిక్ టీ20 ప్రపంచ కప్ నుంచి వైదొలగబోతున్నట్లు వచ్చిన వార్తలకు బలం చేకూరినట్లయింది. తాజా, ఆ వార్తలకు చెక్ పెడుతూ హార్దిక్ పాండ్యా న్యూయార్క్ చేరుకున్నాడు. అక్కడ టీమిండియా జట్టు సభ్యులతో కలిసి ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నాడు.

Also Read : Hardik Pandya : భార్య‌తో డివోర్స్ రూమర్లు.. విదేశాల్లో సోలోగా హార్దిక్ పాండ్యా విహార‌యాత్ర‌..!

టీ20 వరల్డ్ కప్ టోర్నీ జూన్ 2 నుంచి ప్రారంభమవుతుంది. వెస్టిండీస్, యూఎస్ఏ లు సంయుక్తంగా ఈ మెగా టోర్నీకి ఆతిథ్యమిస్తున్నాయి. ఈ టోర్నీలో టీమిండియా తొలి మ్యాచ్ జూన్ 5న ఆడనుంది. జూన్ 9న పాకిస్థాన్ వర్సెస్ ఇండియా మధ్య మ్యాచ్ జరగనుంది. టీ20 వరల్డ్ కప్ కు ముందు బంగ్లాదేశ్ తో జూన్ 1న న్యూయార్క్ లో టీమిండియా వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే టీమిండియా ప్లేయర్స్ న్యూయార్క్ చేరుకున్నారు. ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొంటున్నారు. తాజాగా హార్దిక్ పాండ్యాకూడా న్యూయార్క్ చేరుకొని టీమిండియా సభ్యులతో కలిసి ప్రాక్టీస్ సెషన్ పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ట్విటర్, ఇన్ స్టాగ్రామ్ ఖాతాల్లో హార్దిక్ షేర్ చేశారు. ‘ఆన్ నేషనల్ డ్యూటీ ఇన్’ అంటూ రాశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు.. హార్దిక్ పాండ్యాకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.

 

 

 

 

ట్రెండింగ్ వార్తలు