Hardik Pandya : భార్య‌తో డివోర్స్ రూమర్లు.. విదేశాల్లో సోలోగా హార్దిక్ పాండ్యా విహార‌యాత్ర‌..!

గ‌త కొద్ది రోజులుగా టీమ్ఇండియా అభిమానుల‌ను వేదిస్తున్న ప్ర‌శ్న.. హార్దిక్ పాండ్యా ఎక్క‌డ‌? అని.

Hardik Pandya : భార్య‌తో డివోర్స్ రూమర్లు.. విదేశాల్లో సోలోగా హార్దిక్ పాండ్యా విహార‌యాత్ర‌..!

Hardik Pandya vacationing abroad amid Natasa Stankovic divorce rumours Report

Hardik Pandya – Natasa Stankovic : గ‌త కొద్ది రోజులుగా టీమ్ఇండియా అభిమానుల‌ను వేదిస్తున్న ప్ర‌శ్న.. హార్దిక్ పాండ్యా ఎక్క‌డ‌? అని. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ కోసం కెప్టెన్ రోహిత్ శ‌ర్మ సార‌థ్యంలో ప‌లువురు ఆట‌గాళ్లు, కోచింగ్ సిబ్బందితో కూడిన మొద‌టి విడుత బృందం న్యూయార్క్ కు వెళ్లింది. అయితే.. ఈ బృందంలో జ‌ట్టు వైస్ కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యా  క‌నిపించ‌లేదు. అదే స‌మ‌యంలో అత‌డి వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించిన ఓ వార్త వైర‌ల్‌గా మారింది.

హార్దిక్ పాండ్యా, అత‌డి భార్య నటాసా స్టాంకోవిక్ ల మ‌ధ్య చెడింద‌ని, వీరిద్ద‌రు విడాకులు తీసుకోనున్నారు అనే పుకార్లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో హార్దిక్ అమెరికా విమానం ఎక్క‌క‌పోవ‌డం వాటికి మరింత బ‌లాన్ని చేకూర్చాయి. విడాకుల పుకార్ల‌పై ఇప్ప‌టి వ‌ర‌కు అటు హార్దిక్ గానీ, ఇటు న‌టాసా గానీ స్పందించ‌లేదు. అస‌లు హార్దిక్ పాండ్యా ఎక్క‌డ ఉన్నాడు? అత‌ను టీ20 ప్ర‌పంచ‌క‌ప్ విమానం ఎందుకు ఎక్క‌లేదు అనే ప్ర‌శ్న‌లు ఉద‌యిస్తున్నాయి.

KKR Celebrations : మూడోసారి ఐపీఎల్ ట్రోఫీ.. డ్రెస్సింగ్ రూమ్‌లో కోల్‌క‌తా ఆట‌గాళ్ల సెల‌బ్రెష‌న్స్ చూశారా..?

క్రిక్‌బజ్‌ నివేదిక ప్రకారం.. ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్ క‌థ ముగిసిన వెంట‌నే హార్దిక్ పాండ్యా దేశాన్ని విడిచి వెళ్లిపోయాడ‌ట‌. ఐపీఎల్ కార‌ణంగా తీవ్ర ఒత్తిడికి గురి కావ‌డంతో నూత‌నోత్సాహం పొందేందుకు వారం లేదా అంత‌కు మించి సెల‌వు తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. ఈ క్ర‌మంలోనే అత‌డు విదేశాల‌కు వెళ్లాడు. అక్క‌డ సేద‌తీరుతున్నాడు. ఈ క్ర‌మంలోనే అత‌డు న్యూయార్క్ ఫ్లైట్ మిస్సైయ్యాడు. కాగా.. న్యూయార్క్‌లో జ‌రిగే మొద‌టి ప్రాక్టీస్ సెష‌న్ స‌మాయానికి అత‌డు జ‌ట్టులో చేర‌నున్న‌ట్లుగా తెలుస్తోంది.

రోహిత్ స్థానంలో..

ఐపీఎల్ 2024 సీజ‌న్ ఆరంభానికి ముందు నుంచి హార్దిక్ వార్త‌ల్లో ఉంటూ వ‌స్తున్నాడు. జ‌ట్టుకు ఐదు సార్లు ట్రోపీని అందించిన రోహిత్ శ‌ర్మ‌ను కాద‌ని ముంబై ఇండియ‌న్స్ హార్దిక్‌ను కెప్టెన్‌గా నియ‌మిచింది. ఈ నిర్ణ‌యం అభిమానుల‌కు న‌చ్చ‌లేదు. దీంతో స్టేడియంలో హార్దిక్.. హేళ‌న రూపంలో తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నాడు. అదే స‌మ‌యంలో ముంబై ప్ర‌ద‌ర్శ‌న ఈ సీజ‌న్‌లో అద్వానంగా ఉంది. 14 మ్యాచుల్లో 10 మ్యాచుల్లో ఓడిపోయింది. ఇక ఆల్‌రౌండర్ అయిన హార్దిక్ అన్ని విభాగాల్లోనూ విఫ‌లం అయ్యాడు.

IPL 2024 Prize Money : కోల్‌క‌తాకు రూ.20కోట్లు, స‌న్‌రైజ‌ర్స్ రూ.12.5కోట్లు, బెంగ‌ళూరుకు ఎంతంటే?

ఇన్ని ప్ర‌తికూల‌త‌ల మ‌ధ్య రీప్రెష్ అయ్యేందుకు హార్దిక్ విహార‌యాత్ర‌కు వెళ్లాడు. అయితే.. ఎక్క‌డికి వెళ్లాడు అనే విష‌యాలు మాత్రం తెలియ‌వు. అమెరికా, వెస్టిండీస్ జ‌ట్లు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న‌ టీ20 ప్ర‌పంచ‌కప్‌లో హార్దిక్ కీల‌కం కానున్నాడు.