Hardik Pandya need 5 wickets to Get 100 International T20 Wickets Milestone
Hardik Pandya : యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియాకప్ 2025లో భారత్ అద్భుతంగా ఆడుతోంది. ఆతిథ్య యూఏఈ, పాక్ జట్ల పై విజయాలు సాధించి సూపర్ 4కి అర్హత సాధించింది. ఇక గ్రూప్ స్టేజీలో తమ చివరి మ్యాచ్‌ను పసికూన ఒమన్‌తో శుక్రవారం (సెప్టెంబర్ 19న) ఆడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya)ను ఓ రికార్డు ఊరిస్తోంది.
2016లో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో హార్దిక్ పాండ్యా అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు భారత్ తరుపున 116 మ్యాచ్‌లు ఆడాడు. బ్యాటింగ్‌లో 27.9 సగటుతో 1812 పరుగులు చేశాడు. ఇందులో 5 అర్ధశతకాలు ఉన్నాయి. ఇక బౌలింగ్‌లో 8.24 ఎకానమీతో 95 వికెట్లు తీశాడు.
Asia Cup 2025 : ఓవరాక్షన్ చేస్తే అంతేమరి..! పాకిస్థాన్ జట్టుకు బిగ్‌షాక్.. చర్యలకు సిద్ధమైన ఐసీసీ
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో ప్రస్తుతం హార్దిక్ పాండ్యా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. అతడు మరో రెండు వికెట్లు తీస్తే రెండో స్థానానికి చేరుకుంటాడు. ఐదు వికెట్లు పడగొడితే మాత్రం అగ్రస్థానానికి చేరుకోవడంతో పాటు వంద వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు.
ఆసియాకప్ 2025లో హార్దిక్ రెండు మ్యాచ్‌లు ఆడగా.. రెండింటిలో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. యూఏఈతో మ్యాచ్‌లో వికెట్లు ఏమీ తీయని హార్దిక్ పాక్‌తో మ్యాచ్‌లో తొలి బంతికే వికెట్ పడగొట్టాడు. ఈ క్రమంలో పసికూన ఒమన్ పై హార్దిక్ ఐదు వికెట్లు తీస్తే.. టీ20 క్రికెట్‌లో వంద వికెట్ల మైలురాయిని చేరుకున్న తొలి భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించే అవకాశం ఉంది.
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లోభారత్ తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్న అర్ష్‌దీప్ సింగ్ ఆసియాకప్ 2025కి ఎంపికైనప్పటికి కూడా తుది జట్టులో ఆడే అవకాశం రావడం లేదు. ఈ క్రమంలో హార్దిక్ వంద వికెట్ల క్లబ్‌లో చేరే తొలి ఆటగాడిగా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నారు. మరోవైపు ఈ మైలురాయిని చేరుకునేందుకు బుమ్రాకు 8 వికెట్లు కావాలి.
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో టీమ్ఇండియా తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే..
* అర్ష్‌దీప్ సింగ్ – 63 మ్యాచుల్లో – 99 వికెట్లు
* యుజ్వేంద్ర చాహల్ – 80 మ్యాచుల్లో 96 వికెట్లు
* హార్దిక్ పాండ్యా – 116 మ్యాచ్‌ల్లో 95 వికెట్లు
* జస్‌ప్రీత్ బుమ్రా – 72 మ్యాచుల్లో – 92 వికెట్లు
* భువనేశ్వర్ కుమార్ – 87 మ్యాచుల్లో – 90 వికెట్లు