Hardik Pandya : టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అరుదైన ఘనతకు కొద్ది దూరంలో ఉన్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 1000 పరుగులతో పాటు 100 వికెట్లు తీసిన తొలి భారత ఆటగాడిగా నిలవనున్నాడు. పొట్టి ఫార్మాట్‌లో అతడు మరో 6 వికెట్లు తీస్తే ఈ ఘనత అందుకోనున్నాడు.
హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఇప్పటి వరకు భారత్ తరుపున 114 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. బ్యాటింగ్‌లో 27.9 సగటుతో 1812 పరుగులు చేశాడు. ఇందులో 5 అర్థశతకాలు ఉన్నాయి. ఇక బౌలింగ్‌లో 94 వికెట్లు సాధించాడు. ఇందులో మూడు సార్లు నాలుగు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. అత్యుత్తమ ప్రదర్శన 4/16గా ఉంది.
Arshdeep Singh T20 wickets : అయ్యో అర్ష్‌దీప్.. ఆర్నెళ్లుగా ఒక్క వికెట్ కోసం..
ఆసియాకప్ 2025లో అందుకునేనా?
యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ఆసియాకప్ 2025 ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీలో హార్దిక్ పాండ్యా ఆరు వికెట్లు తీసే అవకాశం ఉంది.
ఈ మెగాటోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడనుంది. ఇక చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ జట్ల మధ్య సెప్టెంబర్ 14న మ్యాచ్ జరగనుంది. ఇక లీగ్ స్టేజ్‌లో భారత్ తన చివరి మ్యాచ్‌ను ఒమన్‌తో సెప్టెంబర్ 19న ఆడనుంది. ఆ తరువాత సూపర్ 4 దశ ప్రారంభం కానుంది.
భారత్ తరుపున టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నాడు. అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ మాత్రమే అతడి కన్నా ముందు ఉన్నారు. ఆసియా కప్‌లో చాహల్‌ను పాండ్యా అధిగమించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
భారత్ తరుపున టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే..
* అర్ష్‌దీప్ సింగ్ – 63 మ్యాచుల్లో – 99 వికెట్లు
* యుజ్వేంద్ర చాహల్ – 80 మ్యాచుల్లో 96 వికెట్లు
* హార్దిక్ పాండ్యా – 114 మ్యాచ్‌ల్లో 94 వికెట్లు
* భువనేశ్వర్ కుమార్ – 87 మ్యాచుల్లో – 90 వికెట్లు
* జస్‌ప్రీత్ బుమ్రా – 70 మ్యాచుల్లో – 89 వికెట్లు