Ian Chappell on Hardik Pandya : హార్దిక్ పాండ్యా వస్తే బాగుంటుంది.. అదే నాకు అర్థం కావడం లేదు..

Ian Chappell on Hardik Pandya : 2018 తర్వాత హార్దిక్ పాండ్యా టెస్ట్ జట్టులో లేడనే విషయం క్రికెట్ అభిమానులకు గుర్తుండే ఉంటుంది. టెస్టు ఫార్మాట్‌లో ఆడాలనుకుంటే అతడికి కచ్చితంగా అవకాశం ఇవ్వాలి.

Ian Chappell on Hardik Pandya : ఇండోర్ టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా భారీ తేడాతో ఓడిపోవడంతో సీనియర్ క్రికెటర్లు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియా దిగ్గజం ఇయాన్ చాపెల్ కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఉండివుంటే భారత టెస్టు జట్టు సమతూకంగా ఉండేదని ఆయన పేర్కొన్నారు. టెస్ట్ టీమ్ లో అతడిని ఎందుకు తీసుకోలేదో తనకు అర్థం కాలేదని వ్యాఖ్యానించారు. 2018 తర్వాత హార్దిక్ పాండ్యా టెస్ట్ జట్టులో లేడనే విషయం క్రికెట్ అభిమానులకు గుర్తుండే ఉంటుంది.

ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్, ఓపెనర్ డేవిడ్ వార్నర్ వ్యక్తిగత కారణాల వల్ల స్వదేశానికి వెళ్లారు. కీలక ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ ఆస్ట్రేలియా జట్టులోకి చేర్చారు. కామెరాన్ రాకతో ఆసీస్ టీమ్ బాలెన్స్ గా కనిపించింది. కీలక దూరమైనా ఆస్ట్రేలియా సమిష్టిగా రాణించి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో ఇయాన్ చాపెల్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీమిండియా టెస్ట్ జట్టులో అతడిని భాగం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

“భారత టెస్టు జట్టులో హార్దిక్ పాండ్యా ఎందుకు భాగం కాలేదో తనకు అర్థం కావడం లేదు. టెస్టు ఫార్మాట్‌లో ఆడాలనుకుంటే అతడికి కచ్చితంగా అవకాశం ఇవ్వాలి. పాండ్యా వస్తే జట్టు సమతూకంగా ఉంటుంది. పాండ్యా సుదీర్ఘంగా బౌలింగ్ చేయలేడని కొంతమంది నాతో అన్నారు. వీళ్లు వైద్యుల మాటలు వింటున్నారా లేదా క్రికెట్ వ్యక్తులతో మాట్లాడుతున్నారా? పాండ్యా ఆడాలనుకుంటే అతడు టెస్ట్ జట్టులో ఉండాలి. అతడు మంచి బ్యాట్స్‌మెన్, ఫీల్డర్. బాగా బౌలింగ్ చేయగలడు” అని ఈఎస్ పీఎన్ తో ఇయాన్ చాపెల్ అన్నారు.

Also Read: మొన్న కేఎల్ రాహుల్.. నేడు కేఎస్ భరత్.. ఆటాడుకుంటున్న ట్రోలర్లు

ఆస్ట్రేలియాతో ఇండోర్ లో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ లో భారత్ 9 వికెట్ల భారీ తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. చివరిదైన నాలుగో టెస్ట్ మార్చి 9 నుంచి అహ్మదాబాద్ లో జరగనుంది. చివరి టెస్టులో విజయం కోసం రెండు జట్లు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. నాలుగో టెస్ట్ లో గెలిచి సిరీస్ ను సమం చేయాలని ఆసీస్ భావిస్తోంది. కచ్చితంగా విజయం సాధించాలని టీమిండియా కూడా పట్టుదలతో ఉంది. చివరి మ్యాచ్ డ్రా అయిన సిరీస్ భారత్ సొంతమవుతుంది.

Also Read: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్ చేరాలంటే.. శ్రీలంక జట్టు ఓడాల్సిందేనా..

ట్రెండింగ్ వార్తలు