KS Bharat: మొన్న కేఎల్ రాహుల్.. నేడు కేఎస్ భరత్.. ఆటాడుకుంటున్న ట్రోలర్లు

KS Bharat: మొన్నటివరకు కేఎల్ రాహుల్ పై విరుచుకుపడిన ట్రోలర్లు తాజాగా టీమిండియా వికెట్ కీపర్ కేఎస్ భరత్ ను టార్గెట్ చేశారు.

KS Bharat: మొన్న కేఎల్ రాహుల్.. నేడు కేఎస్ భరత్.. ఆటాడుకుంటున్న ట్రోలర్లు

KS Bharat: మొన్నటివరకు కేఎల్ రాహుల్ పై విరుచుకుపడిన ట్రోలర్లు తాజాగా టీమిండియా వికెట్ కీపర్ కేఎస్ భరత్ ను టార్గెట్ చేశారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో ఆకట్టుకోలేకపోయిన భరత్ ను జట్టు నుంచి తప్పించాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్ ల్లో భరత్ తన మార్క్ చూపించలేకపోయాడు. మూడో టెస్ట్ లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు నిలబడలేకపోయాడు. దీంతో అతడిపై టీమిండియా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు.

ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ లో రోహిత్ సేన ఘోరంగా ఓడిపోవడంతో భరత్ పై ఫోకస్ పెట్టారు ఫ్యాన్స్. నాలుగు టెస్ట్ కు కేఎస్ భరత్ స్థానంలో ఇషాన్ కిషన్ లేదా వృద్ధిమాన్ సాహాలను తీసుకోవాలని టీమిండియా ఫ్యాన్స్ కోరుతున్నారు. రిషబ్ పంత్ వచ్చే వరకు వీరిద్దరిలో ఎవరో ఒకరికి అవకాశం ఇవ్వాలని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. కొంతమంది శాంజు సామ్సన్ పేరు కూడా సూచిస్తున్నారు.

మూడు టెస్టుల్లో 5 ఇన్నింగ్స్ ఆడిన భరత్ 14.25 సగటుతో మొత్తం 57 పరుగులు చేశాడు. ఈ ఐదు ఇన్నింగ్స్ లో అతడి అత్యధిక స్కోరు 23. రెగ్యులర్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో టెస్టు జట్టులో భరత్ కు అవకాశం దొరికింది. అయితే ఇప్పటివరకు అతడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడని భారత క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. అందుకే నాలుగో టెస్ట్ లో అతడిని తప్పించాలని కోరుతున్నారు. భరత్ ను ట్రోల్ చేస్తూ కొంత మంది ట్విటర్ లో ఫొటోలు, వీడియోలు, కామెంట్లు పెడుతున్నారు.


Also Read: రోహిత్ శర్మ వ్యూహాలపై సునీల్ గవాస్కర్ తీవ్ర అసంతృప్తి

అయితే ఇక్కడో విషయం గమనించాలి. ఇండోర్ టెస్ట్ లో పుజారా మినహా జట్టు మొత్తం విఫలమైంది. కేవలం ఒకట్రెండు మ్యాచ్ ల పదర్శన ఆధారంగానే భరత్ ను తప్పించాలని అనడం సరికాదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. కేఎల్ రాహుల్ స్థానంలో జట్టులోకి వచ్చిన శుభమాన్ గిల్ కూడా భారీ స్కోరు చేయలేదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. శ్రేయస్ అయ్యర్ కూడా ఓటమిని ఆపలేకపోయాడని అంటున్నారు. ఇక చివరి మ్యాచ్ కు ఇదే జట్టును కొనసాగిస్తారా, ఏమైనా మార్పులు ఉంటాయా అనేది వేచిచూడాలి. నాలుగు టెస్ట్ మ్యాచ్.. మార్చి 9 నుంచి అహ్మదాబాద్ లో జరగనుంది.