Border–Gavaskar Trophy: “ఇలా చేయడం సరికాదు” అంటూ రోహిత్ వ్యూహాలపై సునీల్ గవాస్కర్ తీవ్ర అసంతృప్తి

ఇండోర్ లో జరుగుతున్న భారత్-ఆస్ట్రేలియా మూడో వన్డే మ్యాచులో కెప్టెన్ రోహిత్ శర్మ రెండో రోజు మొదటి గంట మొత్తం రవిచంద్రన్ అశ్విన్ కు బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వకపోవడంపై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రోహిత్ వ్యూహం సరికాదని అభిప్రాయపడ్డారు.

Border–Gavaskar Trophy: “ఇలా చేయడం సరికాదు” అంటూ రోహిత్ వ్యూహాలపై సునీల్ గవాస్కర్ తీవ్ర అసంతృప్తి

Border–Gavaskar Trophy

Border–Gavaskar Trophy: ఇండోర్ లో జరుగుతున్న భారత్-ఆస్ట్రేలియా మూడో వన్డే మ్యాచులో కెప్టెన్ రోహిత్ శర్మ రెండో రోజు మొదటి గంట మొత్తం రవిచంద్రన్ అశ్విన్ కు బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వకపోవడంపై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రోహిత్ వ్యూహం సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం జరుగుతోన్న బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ రెండో స్థానంలో ఉన్నాడు.

అయినప్పటికీ, రెండోరోజు టీ బ్రేక్ కి కొన్ని నిమిషాల ముందే అశ్విన్ కు బౌలింగ్ వేసే అవకాశం వచ్చింది. ఆటగాళ్ల కూర్పుపైనే దృష్టి పెట్టి, క్రికెటర్ సమర్థతను పట్టించుకోవట్లేదని సునీల్ గవాస్కర్ చెప్పారు. క్రీజులో ఇద్దరు రైట్ హ్యాండ్ బ్యాటర్లు హ్యాండ్స్కాంబ్, కామెరూన్ గ్రీన్ ఉండడంతో పేసర్ మొహమ్మద్ సిరాజ్, ఎడమ చేతి వాట స్పిన్నర్ రవీంద్ర జడేజాకు మొదట బౌలింగ్ వేసే అవకాశాన్ని రోహిత్ ఇచ్చాడని అన్నారు.

అయితే, వారిద్దరి జోడీని సిరాజ్, జడేజా పడగొట్టలేకపోయారని చెప్పారు. చివరకు టీ బ్రేక్ కి కొన్ని నిమిషాల ముందు అశ్విన్ (రైట్ హ్యాండ్ బౌలర్) కు బాల్ ఇచ్చారని, అతడి బౌలింగ్ లోనే హ్యాండ్స్కాంబ్ ఔటయ్యాడని గుర్తు చేశారు. అశ్విన్ టాప్ ఆటగాడని, వికెట్లు తీస్తున్నాడని చెప్పారు. రైట్ హ్యాండరా? లెఫ్ట్ హాండరా? అన్నది పెద్ద విషయమేమీ కాదని అన్నారు. అశ్విన్ గొప్ బౌలర్ అని చెప్పారు. టెస్టుల్లో అశ్విన్ 450కి పైగా వికెట్లు తీశాడని తెలిపారు. ముందుగానే బౌలింగ్ చేసే అవకాశం అశ్విన్ కు ఇవ్వాల్సిందని చెప్పారు. అయితే, అందుకు భిన్నంగా ప్రతిసారి ఎందుకు జరుగుతుందని ప్రశ్నించారు.

India vs Australia Test: ఇండోర్ పిచ్‌పై వివాదం.. మాజీల విమర్శలు.. ఐసీసీ చర్యలకు సిద్ధమైందా?