Hardik Pandya: హార్దిక్ పాండ్యా దగ్గర రూ.10.8 కోట్లు విలువ చేసే వాచ్‍‌లు

టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టులో లేని లోటు కనిపిస్తుంది. శ్రీలంక టూర్ లో కనిపించిన పాండ్యా.. మరికొద్ది రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021

Hardik Pandya

Hardik Pandya: టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టులో లేని లోటు కనిపిస్తుంది. శ్రీలంక టూర్ లో కనిపించిన పాండ్యా.. మరికొద్ది రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021లో కనిపించనున్నాడు. ముంబై ఇండియన్స్ ట్రైనింగ్ క్యాంప్ లో ఇప్పటికే జాయిన్ అయిపోయాడు కూడా. ప్రతి అప్‌డేట్‌ను పంచుకునే పాండ్యా.. రీసెంట్ గా ఇన్‌స్టాలో ఒక క్రేజీ పోస్టు పెట్టాడు.

Rolls Royce Cullinan కారు.. సన్ గ్లాసెస్ తో పాటు సమ్మర్ హ్యాట్ పెట్టుకుని దిగిన ఫొటోను పోస్టు చేశాడు. అందులో అతని చేతికి అరుదుగా దొరికే Patek Philippe Nautilus Platinum 5711 మోడల్ వాచ్ కనిపించింది. అందులో డయల్ చుట్టూ రత్నాలు పొదిగి.. మెరిసిపోతుంది. ఇలాంటి వాచ్‌లు అతని కలక్షన్‌లో మరిన్ని ఉన్నాయి.

Patek Philippe Nautilus Platinum 5711 – రూ.5కోట్లు

Patek Philippe Nautilus 18k White Gold – రూ.2.7కోట్లు

Patek Philippe Nautilus 5712R – రూ. 1.65కోట్లు

Rolex Oyster Perpetual Daytona Cosmograph – రూ.1కోటి

Audemars Piguet Royal Oak Selfwinding Chronograph Rose Gold – రూ.38లక్షలు