Harmanpreet Kaur
Women T20 World Cup 2024: ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ లో భాగంగా శుక్రవారం రాత్రి భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ జట్టు ఓటమి పాలైంది. న్యూజిలాండ్ జట్టు 58 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. 161 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ జట్టు చతికిలపడింది. వరుసగా వికెట్లు కోల్పోయింది. దీంతో 19 ఓవర్లలో 102 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లోనే భారత మహిళల జట్టు ఓటమిని చవిచూసింది. అయితే, ఈ మ్యాచ్ లో అంపైర్ నిర్ణయంపై వివాదం చెలరేగింది.
Also Read : IND vs BAN: హైదరాబాద్‌లో ఇండియా, బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్‌కు టికెట్ల విక్రయం ప్రారంభం.. పూర్తి వివరాలు ఇలా..
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ సందర్భంగా అమేలియా రనౌటైనా అంపైర్లు నాటౌట్ గా ప్రకటించడం వివాదానికి దారితీసింది. 14వ ఓవర్ చివరి బంతిని ఎక్స్ ట్రా కవర్స్ వైపు పంపి ఒక పరుగు తీసింది. స్వ్కేర్ లెగ్ అంపైర్ బంతి పూర్తయిందన్న ఉద్దేశంతో షూ లేస్ కట్టుకుంటూ కనిపించింది. అయితే, బ్యాటర్లు అమేలియా, సోఫీ రెండో పరుగు కోసం ప్రయత్నించారు. హర్మన్ నుంచి బంతి అందుకున్న వికెట్ కీపర్ రిచా ఘోష్ అమేలియాను రనౌట్ చేసింది. దీంతో అమేలియా రనౌట్ అయినట్లు భావించి పెవిలియన్ వైపు వెళ్లేందుకు అడుగులు వేసింది. కానీ, అంపైర్లు ఆ ఔట్ పరిగణలోకి రాదని చెప్పారు. అంపైర్ బంతి అప్పటికే డెడ్ అయినట్లు ప్రకటించి ఆమెను వెనక్కు పిలిచింది. దీంతో భారత్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కు కోపం వచ్చింది. ఇదేం నిర్ణయం అంటూ అంపైర్ తో వాగ్వివాదానికి దిగింది. అయినా అంపైర్ తన నిర్ణయంలో ఎలాంటి మార్పులేదని.. అమేలియా నాటౌట్ అని స్పష్టం చేశారు. దీంతో చేసిదేమీలేక హర్మన్ ప్రీత్ అపైంర్ నిర్ణయంపై అసహనంతో ఫీల్డింగ్ ప్లేస్ కు వెళ్లిపోయింది.
అంపైర్ వివాదాస్పద నిర్ణయం తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన అమేలియా కెర్ కేవలం రెండు బంతులు ఆడి ఆ తరువాత ఔట్ అయింది. రేణుకా సింగ్ వేసిన 15వ ఓవర్లో రెండో బంతికి పూజా వస్త్రాకర్ కు క్యాచ్ ఇచ్చింది. దీంతో ఆమె 22 బంతులు ఆడి 13 పరుగులు మాత్రమే చేసింది. మ్యాచ్ అనంతరం వివాదాస్పదమైన రనౌట్ పై జెమీమా రోడ్రిగ్స్ స్పందించింది. అంపైర్ నిర్ణయం గౌరవిస్తామని చెబుతూనే.. రూల్ కఠినంగా ఉందని పేర్కొంది. అంపైర్ తో భారత్ ఉమెన్స్ జట్టు కెప్టెన్ గొడవ పడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
— The Game Changer (@TheGame_26) October 4, 2024