IND vs BAN: హైద‌రాబాద్‌లో ఇండియా, బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్‌కు టికెట్ల విక్ర‌యం ప్రారంభం.. పూర్తి వివరాలు ఇలా..

బంగ్లాదేశ్ జట్టుతో రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన భారత్ జట్టు.. అక్టోబర్ 6వ తేదీ (ఆదివారం) నుంచి మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను బంగ్లాతో ఆడబోతుంది.

IND vs BAN: హైద‌రాబాద్‌లో ఇండియా, బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్‌కు టికెట్ల విక్ర‌యం ప్రారంభం.. పూర్తి వివరాలు ఇలా..

Uppal Stadium

Updated On : October 5, 2024 / 7:46 AM IST

India Vs Bangladesh T20: బంగ్లాదేశ్ జట్టుతో రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన భారత్ జట్టు.. అక్టోబర్ 6వ తేదీ (ఆదివారం) నుంచి మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను బంగ్లాతో ఆడబోతుంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని యంగ్ టీం బంగ్లాదేశ్ జట్టును ఢీకొట్టేందుకు సిద్ధమైంది. 6వ తేదీన తొలి మ్యాచ్ గ్వాలియర్ లోని మాధవరావు సింధియా క్రికెట్ స్టేడియంలో జరగనుండగా.. అక్టోబర్ 9వ తేదీన రెండో టీ20 మ్యాచ్ న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. 12వ తేదీన మూడో మ్యాచ్ టీ20 మ్యాచ్ హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. మ్యాచ్ లు అన్నీ రాత్రి 7గంటలకు ప్రారంభం కానున్నాయి.

Also Read : Hardik Pandya : హార్దిక్ పాండ్యా బౌలింగ్ తీరుపై బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ అసంతృప్తి!

ఈనెల 12వ తేదీన ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ కోసం టికెట్ల విక్రయంను శనివారం (అక్టోబర్ 5) నుంచి ప్రారంభించనున్నట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ మోహన్ తెలిపారు. శనివారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి పేటీఎం ఇన్ సైడర్ వెబ్ సైట్ లేదా యాప్ లో టికెట్లను విక్రయించడం జరుగుతుందని తెలిపారు. టికెట్ల ప్రారంభ ధర రూ. 750 నుంచి గరిష్ఠ ధర రూ. 15వేలుగా ఉందన్నారు.

 

ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న టికెట్లను ఈ నెల 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జింఖానా స్టేడియంలో రిడంప్షన్ చేసుకోవాలని జగన్ మోహన్ రావు సూచించారు. ఆఫ్ లైన్ లో టికెట్లు విక్రయించడం లేదని స్పష్టం చేశారు.