Harmanpreet pulls off a stunning one handed catch in first ODI against West Indies
భారత మహిళా క్రికెట్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ పట్టిన ఓ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో హర్మన్ ఈ క్యాచ్ అందుకుంది. వెస్టిండీస్ ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో ఆమె ఈ క్యాచ్ అందుకుంది.
ఈ ఓవర్‌ను రేణుకా సింగ్ వేసింది. ఈ ఓవర్‌లోని చివరి బంతిని విండీస్ బ్యాటర్ ఆలియా అలీన్ (13) భారీ షాట్ కొట్టాలని ప్రయత్నించింది. మిడాన్ మీదుగా బంతిని బౌండరీకి తరలించాలని చూసింది. అయితే.. మిడాన్ లో ఫీల్డింగ్ చేస్తున్న కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్ అందుకుంది. అలీన్ ఆశ్చర్యపోగా.. భారత జట్టు సంబరాల్లో మినిగిపోయింది.
Sanju Samson : సంజూ శాంసన్ కీలక నిర్ణయం.. ఐపీఎల్ 2025లో మారనున్న రోల్!
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో భారత మహిళా జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. టీమ్ఇండియా బ్యాటర్లలో స్మృతి మంధాన (91) తృటిలో శతకాన్ని చేజార్చుకుంది. హర్లీన్ డియోల్ (44), ప్రతీకా రావల్ (40) లు రాణించారు. విండీస్ బౌలర్లలో జైదా జేమ్స్ ఐదు వికెట్లు తీసింది.
అనంతరం లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ మహిళా జట్టు 26.2 ఓవర్లలో 103 పరుగులకు ఆలౌటైంది. అఫీ ఫ్లెచర్ (24), షెమైన్ కాంప్‌బెల్లే (21), కరిష్మా రామ్‌హారక్ (11) లు మాత్రమే రెండు అంకెల స్కోరు చేశారు. మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. దీంతో భారత్ 211 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
తొలి వన్డేలో విజయంతో మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది.
𝗣𝗹𝗮𝘆 𝗜𝘁 𝗢𝗻 𝗟𝗼𝗼𝗽!
𝙒𝙃𝘼𝙏. 𝘼. 𝘾𝘼𝙏𝘾𝙃! 😯
Absolute screamer! 👌 👌
Harmanpreet Kaur – Take A Bow 🙌 🙌
Live ▶️ https://t.co/OtQoFnoAZu#TeamIndia | #INDvWI | @ImHarmanpreet | @IDFCFIRSTBank pic.twitter.com/Fkuyj75Ok0
— BCCI Women (@BCCIWomen) December 22, 2024