Sanju Samson : సంజూ శాంసన్ కీలక నిర్ణయం.. ఐపీఎల్ 2025లో మారనున్న రోల్!
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూశాంసన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు.

Sanju Samson Announces IPL 2025 Sacrifice
Sanju Samson : రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూశాంసన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో వికెట్ కీపింగ్ త్యాగం చేయనున్నట్లు చెప్పాడు. ఇన్నాళ్లు ఆర్ఆర్ తరుపున వికెట్ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన సంజూశాంసన్ ఇక పై ఆ బాధ్యతలను ధ్రువ్ జురెల్ కు అప్పగించనున్నట్లు వెల్లడించాడు. అవసరం అనుకుంటే వికెట్ కీపింగ్ బాధ్యతలను పంచుకునే అవకాశాలు ఉన్నాయన్నాడు.
ఈ విషయం పై ఇప్పటికు ధ్రువ్ జురెల్‌తో చర్చించినట్లు వెల్లడించాడు. అతడు కూడా బాధ్యతలను తీసుకునేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు చెప్పాడు. ‘ఈ విషయాన్ని ఇప్పటి వరకు బయటకు చెప్పలేదు. కానీ ధృవ్ జురెల్ టెస్ట్ వికెట్ కీపర్‌గా రాణించాడు. ఐపీఎల్‌లోనూ అతడు వికెట్ కీపింగ్ బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది చర్చించే అంశమే. మేము వికెట్ కీపర్ బాధ్యతలను పంచుకుంటాం. అని అనుకుంటున్నాను.’ అని శాంసన్ అన్నాడు.
తాను ఫీల్డర్ గా ఉంటూ ఇప్పటి వరకు కెప్టెన్సీ బాధ్యతలను నిర్వర్తించలేదని శాంసన్ చెప్పుకొచ్చాడు. ఇది తనకు ఓ సవాల్ అని అన్నాడు. జట్టు నాయకుడిగా నా బాధ్యతలను నేను నిర్వర్తించాలి. టీమ్‌కే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. అదే సమయంలో ఆటగాళ్లకు తగిన ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నాడు.
ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌తో ధ్రువ్ జురెల్ అరంగ్రేటం చేశాడు. అద్భుతంగా రాణించాడు. అయితే.. రిషబ్ పంత్ పూర్తి ఫిట్‌నెస్‌తో తిరిగి రావడంతో జట్టులో స్థానం కోల్పోయాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ధ్రువ్ జురెల్, పంత్ ఇద్దరూ ఆడారు. అయితే రెండు, మూడో టెస్టులో ధ్రువ్‌కు తుది జట్టులో స్థానం దక్కలేదు. మిగిలిన రెండు మ్యాచుల్లోనూ అతడు బెంచీకే పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
మెగా వేలం అనంతరం ఆర్ఆర్ జట్టు ఇదే..
సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్ , రియాన్ పరాగ్ , ధృవ్ జురెల్, షిమ్రోన్ హెట్మెయర్, సందీప్ శర్మ, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, వనిందు హసరంగా, ఆకాష్ మధ్వల్, కుమార్ కార్తికేయ, నితీష్ రాణా, తుషార్ దేశ్‌పాండే, శుభమ్ దూబే, యుధ్వీర్ సింగ్, ఫజల్‌హక్ ఫరూఖీ, వైభవ్ సూర్యవంశీ, క్వేనా మఫాకా, కునాల్ రాథోడ్, అశోక్ శర్మ.
Virat Kohli : ఓ తండ్రి తన కుమారుడికి కోహ్లీని ఎలా పరిచయం చేస్తున్నాడో చూశారా? అటు చూడు.. అతడే..