Virat Kohli : ఓ తండ్రి తన కుమారుడికి కోహ్లీని ఎలా పరిచయం చేస్తున్నాడో చూశారా? అటు చూడు.. అతడే..
టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

A Father Introducing Kohli To His Son At Mcg
టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. క్రికెట్ ప్రపంచంలో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అతడు మైదానంలోకి దిగాడంటే చాలు పరుగుల వరద పారాల్సిందే. అతడి ఆటకు మనదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. విదేశాల్లో భారత జట్టు ఆడుతుందంటే కోహ్లీని చూసేందుకే చాలా మంది వస్తారు అనడంలో అతిశయోక్తి లేదేమో.
ప్రస్తుతం కోహ్లీ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడుతున్నాడు. మూడు టెస్టుల్లో కేవలం 126 పరుగులు మాత్రమే చేశాడు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన కోహ్లీ.. ఆ తరువాత అంచనాలను అందుకోలేకపోతున్నాడు. ఈ క్రమంలో డిసెంబర్ 26న మెల్‌బోర్న్ వేదికగా ప్రారంభం కానున్న నాలుగో టెస్టు మ్యాచులో సత్తా చాటాలని భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మెల్‌బోర్న్ మైదానంలోని నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు.
IND vs ENG : భారత్‌తో వన్డే, టీ20 సిరీస్‌కు ఇంగ్లాండ్ జట్టు ప్రకటన.. అతడొచ్చేశాడు..
కాగా.. కోహ్లీ మైదానంలో సాధన చేస్తుండగా పై ఓ వ్యక్తి తన కొడుకుకు విరాట్ ని పరిచయం చేస్తున్నాడు. అదిగో అక్కడ చూడు.. అతడే విరాట్ కోహ్లీ.. ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడు అని చెబుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్‌గా మారింది.
ఇక సిరీస్ విషయానికి వస్తే.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మూడు మ్యాచులు ముగిసే సరికి భారత్, ఆస్ట్రేలియా జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. తొలి మ్యాచులో భారత్ గెలవగా, రెండో మ్యాచులో ఆసీస్ విజయం సాధించింది. మూడో మ్యాచ్ డ్రా గా ముగిసింది. దీంతో అందరి దృష్టి బాక్సింగ్ డే టెస్టు పైనే పడింది. ఈ మ్యాచ్‌లో గెలుపొంది సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకువెళ్లాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.
PV Sindhu : ఘనంగా పీవీ సింధు వివాహం.. రాజస్థాన్‌లో ..
A FATHER INTRODUCING VIRAT KOHLI TO HIS SON AT MCG 🤍
– The Legacy of the 🐐 [Rohit Juglan] pic.twitter.com/Rmuawu3GmP
— Johns. (@CricCrazyJohns) December 22, 2024