PV Sindhu : ఘనంగా పీవీ సింధు వివాహం.. రాజస్థాన్‌లో ..
బ్యాడ్మింటన్ కోర్టులో రాకెట్‌తో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ ఎన్నో చారిత్రక విజయాలను సొంతం చేసుకున్న భారత స్టార్ పీవీ సింధు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది.

PV Sindhu married Venkata Datta Sai in Rajasthan
బ్యాడ్మింటన్ కోర్టులో రాకెట్‌తో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ ఎన్నో చారిత్రక విజయాలను సొంతం చేసుకున్న భారత స్టార్ పీవీ సింధు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయితో సింధు పెళ్లి జరిగింది.
ఆదివారం రాత్రి 11 గంటల 20 నిమిషాలకు మూడు ముళ్ల బంధంతో సింధు-సాయి ఒక్కటి అయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్ సాగర్ సరస్సులో ఉన్న రఫల్స్ హోటల్‌లో వీరి పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది.
U19 womens Asia Cup : అండర్ -19 మహిళల ఆసియా కప్ ఛాంపియన్‌గా భారత్
వీరి వివాహానికి ఇరు కుటుంబాలతో పాటు అత్యంత సన్నిహితులు, ప్రత్యేక అతిథులు మాత్రమే హాజరు అయ్యారు. సోషల్ మీడియా వేదికగా కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి
మంగళవారం (డిసెంబర్ 24న) హైదరాబాద్‌లో రిసెప్షన్ జరగనుంది. సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు వీరి రిసెప్షన్‌కు హాజరు అయ్యే అవకాశం ఉంది.
IND vs AUS : రోహిత్ శర్మ గాయంపై ఆకాశ్ దీప్ అప్‌డేట్..