U19 womens Asia Cup : అండర్ -19 మహిళల ఆసియా కప్ ఛాంపియన్‌గా భారత్

కౌలాలంపూర్ వేదిక‌గా జ‌రిగిన అండ‌ర్‌-19 ఆసియా క‌ప్ టోర్నీ విజేత‌గా భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు నిలిచింది

U19 womens Asia Cup : అండర్ -19 మహిళల ఆసియా కప్ ఛాంపియన్‌గా భారత్

India clinch inaugural Under 19 Womens Asia Cup

Updated On : December 22, 2024 / 11:41 AM IST

కౌలాలంపూర్ వేదిక‌గా జ‌రిగిన అండ‌ర్‌-19 ఆసియా క‌ప్ టోర్నీ విజేత‌గా భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు నిలిచింది. టీ20 ఫార్మాట్‌లో మొద‌టి సారి జ‌రిగిన ఈ టోర్నీ ఫైన‌ల్‌లో బంగ్లాదేశ్ పై 41 ప‌రుగుల తేడాతో భార‌త్ విజ‌యం సాధించింది.

ఈ మ్యాచ్ లో భార‌త్ మొద‌ట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్ల న‌ష్టానికి 117 ప‌రుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భార‌త్‌కు షాకులు త‌గిలాయి. ఓపెన‌ర్ కమిలిని (5), వన్‌డౌన్ బ్యాటర్ సానికా చల్కే (0) విఫ‌లం అయ్యారు.

IND vs AUS : రోహిత్ శ‌ర్మ గాయంపై ఆకాశ్ దీప్ అప్‌డేట్‌..

అయితే.. మ‌రో ఓపెన‌ర్ గొంగడి త్రిష (52) హాఫ్ సెంచ‌రీతో రాణించింది. కెప్టెన్ నికీ ప్ర‌సాద్ (12), మిథిలా (17), ఆయుషి శుక్లా (10)లు ఫ‌ర్వాలేద‌నిపించారు. బంగ్లా బౌలర్లలో ఫర్జానా నాలుగు వికెట్లు తీసింది. నిషితా అక్తర్ నిషి రెండు వికెట్లు, హబిబా ఓ వికెట్ ప‌డ‌గొట్టింది.

అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో బంగ్లాదేశ్ త‌డ‌బ‌డింది. 18.3 ఓవ‌ర్ల‌లో 76 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. బంగ్లా బ్యాట‌ర్ల‌లో జౌరియా ఫెర్డోస్ (22), ఫహోమిదా చోయా (18) లు మాత్ర‌మే రెండు అంకెల స్కోరు సాధించారు. మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే ప‌రిమితం అయ్యారు. భార‌త బౌల‌ర్ల‌లో ఆయుషి శుక్లా మూడు వికెట్లు తీసింది. సిసోదియా, సోనమ్ యాదవ్ లు చెరో రెండు వికెట్లు తీయ‌గా జోషిత ఓ వికెట్ ప‌డ‌గొట్టింది.

Champions Trophy 2025 : ఛాంపియ‌న్స్ ట్రోఫీ షెడ్యూల్ ఇదేనా? భార‌త్‌, పాక్ మ్యాచ్ ఎప్పుడంటే.?