Champions Trophy 2025 : ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ఇదేనా? భారత్, పాక్ మ్యాచ్ ఎప్పుడంటే.?
వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీపై అనిశ్చితి తొలగింది.

ICC champions trophy 2025 likely schedule revealed
వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీపై అనిశ్చితి తొలగింది. హైబ్రిడ్ మోడ్‌కు పాకిస్థాన్ అంగీకరించింది. దీంతో భారత్ ఆడే మ్యాచులు తటస్థ వేదికలపై జరగనున్నాయి. అంతేకాకుండా 2027 వరకు భారత్ వేదికగా జరిగే ఐసీసీ టోర్నీల్లో పాకిస్థాన్ కూడా తటస్థ వేదికగా మ్యాచులు ఆడుతుందని ఐసీసీ చెప్పింది. త్వరలోనే ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ను విడుదల చేస్తామని వెల్లడించిన సంగతి తెలిసిందే.
కాగా.. ఐసీసీ కంటే ముందే ఓ స్పోర్ట్స్ వెబ్‌సైట్ ఛాంపియన్ ట్రోఫీ పూర్తి షెడ్యూల్ ఇదేనంటూ తెలిపింది. ఈ షెడ్యూల్ ప్రకారం క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 23న జరగనున్నట్లు పేర్కొంది. అయితే.. ఎక్కడ మ్యాచ్ జరుగుతుంది అన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు. తటస్థ వేదిక అని మాత్రమే వెల్లడించింది.
IND vs AUS : బాక్సింగ్ డే టెస్టుకు ముందు భారత్‌కు భారీ షాక్.. నెట్స్‌లో గాయపడ్డ రోహిత్ శర్మ..!
ఈ టోర్నీ ఆరంభ మ్యాచ్ ఫిబ్రవరి 19న పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్నట్లు తెలిపింది. భారత జట్టు తన తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 20న ఆడనుంది. 23న పాక్‌తో, మార్చి 2న న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. ఈ టోర్నీలో మొత్తం 15 మ్యాచులు జరగనున్నాయి. మార్చి 4, 5 తేదీల్లో సెమీఫైనల్ మ్యాచులు జరగనున్నాయి. మార్చి 9 ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
ఇక మ్యాచులు అన్ని కూడా భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్నాయట.
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత షెడ్యూల్..
2025 ఫిబ్రవరి 20 : భారత్ వర్సెస్ బంగ్లాదేశ్
2025 ఫిబ్రవరి 23 : భారత్ వర్సెస్ పాకిస్థాన్
2025 మార్చి 2 : భారత్ వర్సెస్ న్యూజిలాండ్
Arjun Tendulkar: అర్జున్ టెండూల్కర్ సూపర్ బౌలింగ్.. ముంబై తుది జట్టులో చోటుదక్కేనా?
2025 CHAMPIONS TROPHY LIKELY SCHEDULE. (Revsportz). pic.twitter.com/IcryKgvAOm
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 21, 2024