Arjun Tendulkar: అర్జున్ టెండూల్కర్ సూపర్ బౌలింగ్.. ముంబై తుది జట్టులో చోటుదక్కేనా?
అర్జున్ టెండూల్కర్ సూపర్ బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో పదునైన బంతులతో బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.

Arjun Tendulkar
Arjun Tendulka: భారత క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ సూపర్ బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో పదునైన బంతులతో బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఈ టోర్నీలో భాగంగా గ్రూప్-ఏలో ఒడిశా వర్సెస్ గోవా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. గోవా జట్టుకు అర్జున్ టెండూల్కర్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తొలుత గోవా జట్టు బ్యాటింగ్ చేయగా.. నిర్ణీత 50 ఓవర్లలో 371 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ తరువాత ఒడిశా జట్టు బ్యాటింగ్ ప్రారంభించగా.. తొలుత బ్యాటర్లు క్రీజులో పాతకుపోయి పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో అర్జున్ టెండూల్కర్ పదునైన బంతులతో బ్యాటర్లకు చుక్కలు చూపించారు.
Also Read: Vijay Hazare Trophy : శ్రేయస్ అయ్యర్ ఊచకోత.. బెంబేలెత్తిన బౌలర్లు.. 51 బంతుల్లోనే సెంచరీ..
హైస్కోరింగ్ గేమ్ లో అర్జున్ టెండూల్కర్ సూపర్ బౌలింగ్ తో మూడు వికెట్లు పడగొట్టాడు. క్రీజులో పాతుకుపోయి పరుగులు రాబడుతున్న బ్యాటర్లను పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో ఒడిశా జట్టు 49.4 ఓవర్లలో 344 పరుగులకు కుప్పకూలింది. ఫలితంగా గోవా జట్టు విజయంలో అర్జున్ టెండూల్కర్ కీలక భూమిక పోషించాడు. అర్జున్ సూపర్ బౌలింగ్ పట్ల నెట్టింట ప్రశంసల జల్లు కురుస్తోంది. అర్జున్ ఇదే జోరును కొనసాగిస్తే రాబోయే ఐపీఎల్ -2025 టోర్నీలో ముంబై ఇండియన్స్ తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు లేకపోలేదు.
ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో కనీస ధర రూ. 30లక్షలకు ముంబై ఇండియన్స్ అర్జున్ టెండూల్కర్ ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే, అర్జున్ కు ముంబై ఇండియన్స్ తుది జట్టులో చోటు దక్కాలంటే తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ముంబై జట్టులో భీకర పేస్ దళం ఉంది. జస్ర్పీత్ బుమ్రా సారథ్యంలో ట్రెంట్ బౌల్డ్, దీపక్ చాహర్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అర్జున్ తుది జట్టులో చోటు దక్కించుకోవాలంటే రాబోయే దేశవాళీ టోర్నీ మ్యాచ్ లలోనూ సూపర్ బౌలింగ్ తో ఆకట్టుకోవాల్సిందే.