Vijay Hazare Trophy : శ్రేయస్ అయ్యర్ ఊచకోత.. బెంబేలెత్తిన బౌలర్లు.. 51 బంతుల్లోనే సెంచరీ..
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ దేశవాళీ టోర్నీల్లో అదరగొడుతున్నాడు.

Vijay Hazare Trophy Shreyas Iyer rattles Karnataka with 51 ball century
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ దేశవాళీ టోర్నీల్లో అదరగొడుతున్నాడు. శనివారం ప్రారంభమైన విజయ్ హజారే ట్రోఫీ మొదటి మ్యాచ్‌లోనే శతకంతో చెలరేగాడు. కేవలం 51 బంతుల్లోనే శతకాన్ని అందుకున్నాడు.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం బి గ్రౌండ్‌లో ముంబై, కర్ణాటక జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ అంగ్‌క్రిష్ రఘువంశీ 6 పరుగులకే పెవిలియన్‌కు చేరుకున్నాడు. మరో ఓపెనర్ ఆయుశ్ మాత్రే (78)తో వన్‌డౌన్ బ్యాటర్ హార్దిక్ తామోర్(84) ముంబై ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 141 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
నాలుగో స్థానంలో బరిలోకి దిగిన శ్రేయస్ అయ్యర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కర్ణాటక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఎడాపెడా ఫోర్లు, సిక్సర్లు బాదుతూ స్కోరు బోర్డును రాకెట్ వేగంతో పరుగులు పెట్టించాడు. 51 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. మొత్తంగా 55 బంతులు ఆడిన శ్రేయస్ 5 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 114 పరుగులతో అజేయంగా నిలిచాడు.
అతడితో పాటు ఆల్‌రౌండర్ శివమ్ దూబె (63 36 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు) దంచికొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో ముంబై నాలుగు వికెట్లు కోల్పోయి 382 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (20) విఫలం అయ్యాడు.
సూపర్ ఫామ్‌లో అయ్యర్..
ప్రస్తుతం జరుగుతున్న దేశవాళీ సీజన్‌లో అయ్యర్ తన అద్వితీయ ఆటను ప్రదర్శిస్తున్నాడు. రంజీట్రోఫీలో నాలుగు మ్యాచులు ఆడగా 90.40 సగటు 88.80 సగటుతో 452 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 233 పరుగులు.
Robin Uthappa : టీమ్ఇండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్పకు భారీ షాక్.. అరెస్ట్ వారెంట్ జారీ..!
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో శ్రేయాస్ తొమ్మిది మ్యాచ్‌లు ఆడాడు. 49.28 సగటు,188.52 స్ట్రైక్-రేట్‌తో 345 పరుగులు చేశారు. అత్యధిక స్కోరు 130 నాటౌట్
ఆగస్టులో శ్రీలంక పర్యటనలో చివరిసారిగా భారత్ తరఫున ఆడాడు శ్రేయస్ అయ్యర్. వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా జరగనున్న జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో చోటే లక్ష్యంగా ఆడుతున్నాడు.
HUNDRED BY SHREYAS IYER. 🙇♂️
– A century in just 51 balls with 5 fours and 9 sixes by Iyer in the Vijay Hazare Trophy. A classic Iyer show at the Narendra Modi Stadium. ⭐ pic.twitter.com/WiwaVLXiQk
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 21, 2024