Ravichandran Ashwin : రెండు రోజులుగా అంతా గందరగోళంగా ఉంది.. అశ్విన్ రిటైర్‌మెంట్ పై భార్య ప్రీతి ఫస్ట్ రియాక్షన్..
రవిచంద్రన్ అశ్విన్ రిటైర్‌మెంట్ పై ఆయన భార్య ప్రీతి నారాయణ్ తొలి సారి స్పందించింది.

Prithi Narayanan first Reaction after Ravichandran Ashwin Retirement
అంతర్జాతీయ క్రికెట్‌కు ఇటీవల టీమ్ఇండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్‌మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరిగిన మూడో టెస్టు మ్యాచ్ డ్రా గా ముగిసిన వెంటనే రోహిత్ శర్మతో కలిసి విలేకరుల ముందుకు వచ్చిన అశ్విన్ తన రిటైర్‌మెంట్ నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ విషయం విని అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు అంతా షాక్ అయ్యారు. దీనిపై చాలా మంది మాట్లాడినా.. అశ్విన్ భార్య ప్రీతీ నారాయణన్ మాత్రం స్పందించలేదు. తాజాగా ఆమె స్పందించింది.
గత రెండు రోజులుగా తనకు అంతా గందరగోళంగా ఉందని చెప్పింది. ఏం చెప్పాలో, ఎలా మొదలు పెట్టాలో తనకి అర్థం కావడం లేదంది. తన ఫేవరెట్ క్రికెటర్ గురించి చెప్పాలా? లేదంటే తన జీవిత భాగస్వామి అనే కోణంలో చెప్పాలా అనేది తనకు అర్థం కావడం లేదంది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది.
Robin Uthappa : టీమ్ఇండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్పకు భారీ షాక్.. అరెస్ట్ వారెంట్ జారీ..!
అశ్విన్ మీడియాతో మాట్లాడుతున్నప్పుడు.. తనకు చిన్నా, పెద్దా, అన్ని జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయని తెలిపింది. గత 13-14 ఏళ్లలో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. అతిపెద్ద విజయాలు, ఎన్నెన్నో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు, ఓటమి ఎదురైనపుడు గదిలో నిశ్శబ్దాలు, మ్యాచ్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ బోర్డు మీద రాసే రాతలు.. ఇలాంటి జ్ఞాపకాలెన్నో తన కళ్ల ముందు కదలాడాయన్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో విజయం, సిడ్నీ డ్రా, గబ్బాలో విజయం, టీ20లలో పునరాగమనం వంటి సమయాల్లో ఆనందంతో కన్నీళ్లు వచ్చాయన్నారు. అదే సమయంలో ఓటముల వల్ల హృదయం ముక్కలైనప్పుడు ఉండే భయకరమైన నిశ్శబ్దం అన్నీ గుర్తున్నాయన్నారు.
Shreyas Iyer : పంజాబ్ కింగ్స్‌కు మాటిచ్చిన శ్రేయస్ అయ్యర్..
అశ్విన్ ప్రయాణాన్ని దగ్గరి నుంచి చూడడం ఎలా ఉందో వివరించింది..
“ప్రియమైన అశ్విన్.. నాకైతే మొదట్లో క్రికెట్ కిట్ బ్యాగ్ ఎలా సర్దాలో కూడా తెలియదు. నీ నుంచి ఎన్నో విషయాలు నేను నేర్చుకున్నాను. నాకు క్రికెట్ ప్రపంచాన్ని పరిచయం చేసింది నువ్వే. ఆట పట్ల కూడా ప్రేమను కలిగించావు. నీ ప్యాషన్, క్రమశిక్షణ, కఠిన శ్రమ.. వీటన్నింటికి మరేదీ సాటిరాదు.” అని ప్రీతి అంది.
‘నీ అంతర్జాతీయ కెరీర్ అత్యద్భుతంగా సాగింది. ఇక నీ మీద ఉన్న భారాన్ని దించుకునే సమయం వచ్చిసింది. నీకు ఇష్టమైన రీతిలో కొత్త జీవితాన్ని ఆనందించు. ఇష్టమైన, నచ్చిన భోజనాన్నితినేసేయ్. కుటుంబానికి సమయం కేటాయించు. పిల్లలను ఇంకాస్త జాగ్రత్తగా చూసుకో.’ అంటూ ప్రీతి నారాయణన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ప్రీతి పోస్ట్ వైరల్‌గా మారింది.
View this post on Instagram