Shreyas Iyer : పంజాబ్ కింగ్స్‌కు మాటిచ్చిన శ్రేయస్ అయ్యర్..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ట్రోఫీని పంజాజ్ కింగ్స్‌కు అందించడమే తన తదుపరి లక్ష్యం అని టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.

Shreyas Iyer promises to end Punjab Kings IPL trophy drought
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ట్రోఫీని పంజాజ్ కింగ్స్‌కు అందించడమే తన తదుపరి లక్ష్యం అని టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. పంజాబ్ కింగ్స్‌లో భాగం కావడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నాడు. రానున్న ఐపీఎల్ సీజన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చాడు. పంజాబ్‌కు అందని ద్రాక్షలా ఉన్న ఐపీఎల్ ట్రోఫీ కలను తీర్చాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లుగా వెల్లడించాడు.
ఐపీఎల్ 2024 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను విజేతగా నిలిపాడు శ్రేయస్ అయ్యర్. అయితే అనూహ్యంగా కేకేఆర్.. అయ్యర్‌ను వేలానికి విడిచిపెట్టింది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో అతడిని ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంటుందని అంతా భావించారు. కానీ.. అయ్యర్‌ను పంజాబ్ కింగ్స్ భారీ మొత్తాన్ని వెచ్చించి దక్కించుకుంది. రూ.26.75 కోట్లకు కొనుగోలు చేసింది. త్వరలో అతడినే పంజాబ్ కింగ్స్ తమ కెప్టెన్‌గా నియమించే అవకాశాలు ఉన్నాయి.
Ravichandran Ashwin : అప్పుడు ఇలా చెప్పిఉంటే గుండెపోటు వచ్చేదేమో : అశ్విన్
ఇదిలా ఉంటే.. దేశవాలీ సీజన్‌లో అయ్యర్ నాలుగు ట్రోఫీలను గెలుచుకున్నాడు. ఈ క్రమంలో అయ్యర్‌కు సంబంధించిన ఓ వీడియోను పంజాబ్ కింగ్స్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో అయ్యర్ మాట్లాడుతూ.. సయ్యర్ ముస్తాక్ అలీ ట్రోఫీ అందుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉందన్నాడు. విజయం కోసం తామంతా ఎంతో కష్టపడ్డామని చెప్పాడు. ఇప్పుడు మరో లక్ష్యం నా ముందు ఉంది. పంజాబ్ కింగ్స్‌లో భాగం అయినందుకు సంతోషంగా ఉంది. పంజాబ్ కింగ్స్ కుటుంబంలో చేరేందుకు వేచి ఉండలేను అని అన్నాడు.
ఐపీఎల్ విజేతగా పంజాబ్ కింగ్స్‌ను నిలపడమే ప్రస్తుతం తన లక్ష్యమని, కోచ్ రికీ పాంటింగ్‌తో కలిసి లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేస్తానని చెప్పాడు.
👀 on the 🏆#ShreyasIyer #SaddaPunjab #PunjabKings pic.twitter.com/mc48lfIGSj
— Punjab Kings (@PunjabKingsIPL) December 20, 2024