Ravichandran Ashwin : అప్పుడు ఇలా చెప్పిఉంటే గుండెపోటు వ‌చ్చేదేమో : అశ్విన్‌

త‌న రిటైర్‌మెంట్ రోజున స‌చిన్ టెండూల్క‌ర్‌, క‌పిల్ దేవ్‌లు నేరుగా ఫోన్ చేసి అభినంద‌న‌లు తెలియ‌జేసిన‌ట్లు అశ్విన్ తెలిపాడు.

Ravichandran Ashwin : అప్పుడు ఇలా చెప్పిఉంటే గుండెపోటు వ‌చ్చేదేమో : అశ్విన్‌

Ravichandran Ashwin reveals call log from retirement day

Updated On : December 20, 2024 / 3:21 PM IST

టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు ర‌విచంద్ర‌న్ అశ్విన్ అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో అత‌డికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ, అత‌డి భ‌విష్య‌త్తు బాగుండాల‌ని మాజీ ఆట‌గాళ్లు, సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియా వేదిక‌గా కోరుకుంటున్నారు. ఇక త‌న రిటైర్‌మెంట్ రోజున స‌చిన్ టెండూల్క‌ర్‌, క‌పిల్ దేవ్‌లు నేరుగా ఫోన్ చేసి అభినంద‌న‌లు తెలియ‌జేసిన‌ట్లు అశ్విన్ తెలిపాడు. త‌న ఫోన్ కాల్ లిస్ట్‌కు సంబంధించిన స్ర్కీన్‌షాట్‌ను పంచుకున్నాడు.

“టీమ్ఇండియా ఆట‌గాడిగా నా కెరీర్ చివ‌రి రోజున నా ఫోన్ కాల్ లిస్ట్ ఇలా ఉంటుంద‌ని ఎవ‌రైనా 25 ఏళ్ల క్రితం చెప్పిఉంటే.. అప్పుడే నాకు హార్ట్ ఎటాక్ వ‌చ్చి ఉండేదేమో. స‌చిన్ టెండూల్క‌ర్‌, క‌పిల్ దేవ్‌ల‌కు ధ‌న్య‌వాదాలు.” అని అశ్విన్ రాసుకొచ్చాడు.

IND vs AUS : మిగిలిన టెస్టుల‌కు ఆస్ట్రేలియా జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. జూనియ‌ర్ పాంటింగ్‌కు చోటు.. భార‌త్‌కు క‌ష్ట‌కాల‌మేనా?

ఐపీఎల్ ఆడ‌తా..

అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన‌ప్ప‌టికి ఐపీఎల్ ఆడ‌తాన‌ని అశ్విన్ స్ప‌ష్టం చేశాడు. ఓ ఆట‌గాడిగా త‌న కెరీర్ ముగియ‌లేద‌న్నాడు. వీలైనంత ఎక్కువ కాలం ఐపీఎల్ ఆడ‌తాన‌ని తెలిపాడు. త‌న వ‌ర‌కు రిటైర్‌మెంట్ అనేది పెద్ద విష‌యం కాద‌న్నాడు. ప్ర‌స్తుతం తాను విశ్రాంతి తీసుకోవాల‌ని అనుకుంటున్నాన‌ని చెప్పుకొచ్చాడు. ఎలాంటి లక్ష్యాల‌ను నిర్దేశించుకోలేదన్నారు. 2011లో వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన త‌రువాత ఇలాగే స్వాగ‌తం ప‌లికార‌న్నారు.

ఐపీఎల్ 2025 మెగా వేలంలో అశ్విన్ ను చెన్నై సూప‌ర్ కింగ్స్ 9.75 కోట్ల‌కు వెచ్చించి కొనుగోలు చేసింది. కాగా.. చెన్నైతోనే కెరీర్‌ను ప్రాంర‌భించిన అశ్విన్ ఇప్పుడు ముగింపు ద‌శ‌లో ఆ జ‌ట్టులోనే చేర‌డం బాగుంది.

SA vs PAK : పాక్ ఆట‌గాళ్లు అంటే అంతే మ‌రీ.. హెన్రిచ్ క్లాసెన్‌తో హరీస్ రవూఫ్ గొడ‌వ.. మ‌ధ్య‌లో దూరి పెద్దది చేసిన మహ్మద్ రిజ్వాన్..