SA vs PAK : పాక్ ఆటగాళ్లు అంటే అంతే మరీ.. హెన్రిచ్ క్లాసెన్‌తో హరీస్ రవూఫ్ గొడవ.. మధ్యలో దూరి పెద్దది చేసిన మహ్మద్ రిజ్వాన్..
దక్షిణాప్రికా పర్యటనలో పాకిస్థాన్ జట్టు అదరగొడుతోంది.

Rizwan and Rauf get into heated spat with Heinrich Klaasen during Cape Town ODI
దక్షిణాప్రికా పర్యటనలో పాకిస్థాన్ జట్టు అదరగొడుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతుంది. కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డే మ్యాచులో 81 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. దీంతో మూడు మ్యాచుల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 49.5 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్యాటర్లలో మహ్మద్ రిజ్వాన్ (80; 82 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు), బాబర్ ఆజాం (73; 95 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు), కమ్రాన్ గులాబ్ (63; 32 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు బాదారు. సఫారీ బౌలర్లలో క్వేనా మఫాకా నాలుగు వికెట్లు తీయగా మార్కో జాన్సెన్ మూడు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం లక్ష్య ఛేదనలో దక్షిణాప్రికా తడబడింది. 43.1 ఓవర్లలో 248 పరుగులకే కుప్పకూలింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్ (97; 74 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిదీ నాలుగు వికెట్లు తీయగా నదీమ్ షా మూడు వికెట్లు పడగొట్టాడు.
క్లాసెన్‌తో గొడవ పడిన పాక్ ఆటగాళ్లు..
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. 26వ ఓవర్‌ను హరీస్ రవూఫ్ వేశాడు. ఈ ఓవర్‌లోని ఆఖరి బంతిని రవూఫ్ బౌన్సర్‌గా వేశాడు. దీన్ని కొట్టడంలో క్లాసెన్ విఫలం అయ్యాడు. ఆ తరువాత రవూఫ్ ఏదో అన్నాడు. దీంతో క్లాసెన్ కోపంతో ఊగిపోయాడు. మాటకి మాట సమాధానం చెప్పాడు. అంపైర్లు కలగజేసుకుని మ్యాచ్ కొనసాగించాల్సిందిగా కోరారు.
Champions Trophy 2025 : పంతం నెగ్గించుకున్న పాక్.. ఛాంపియన్స్ ట్రోఫీ పై ఐసీసీ కీలక ప్రకటన..
అయితే.. దీన్ని గమనించిన మహ్మద్ రిజ్వాన్ మధ్యలో కలగజేసుకుంటూ క్లాసెన్ పై వేలు చూపిస్తూ ఏదో అన్నాడు. ఇంక క్లాసెన్ కూడా ఏ మాత్రం తగ్గలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. దూకుడుగా ఆడుతున్న క్లాసెన్‌ను ఏకాగ్రతను దెబ్బతీసేందుకే పాక్ ఆటగాళ్లు ఇలా చేశారని అంటున్నారు.
Garma garmi 😤 pic.twitter.com/n8VSK1lflz
— PCT Replays 💚 (@PCTReplays) December 19, 2024