Champions Trophy 2025 : పంతం నెగ్గించుకున్న పాక్.. ఛాంపియన్స్ ట్రోఫీ పై ఐసీసీ కీలక ప్రకటన..
వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ పై అనిశ్చితి వీడింది.

Hybrid model agreed for Champions Trophy and ICC events from 2024 to 27
వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ పై అనిశ్చితి వీడింది. ఈ టోర్నీ నిర్వహణపై ఐసీసీ కీలక ప్రకటన చేసింది. టీమ్ఇండియా కోరినట్లుగా ఈ టోర్నీ హైబ్రిడ్ మోడ్‌లోనే జరగనున్నట్లు తెలిపింది. అయితే.. 2024 నుంచి 2027 వరకు జరగనున్న ఐసీసీ టోర్నీల్లో భారత్, పాక్ మ్యాచులు తటస్థ వేదికల్లోనే నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
భారత్ తమ దేశంలో పర్యటించకుంటే తాము కూడా ఆ దేశంలో పర్యటించమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తేల్చి చెప్పింది. ఈ క్రమంలో భారత్ వేదికగా జరిగే మహిళల వన్డే ప్రపంచకప్ 2025, పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీల కోసం పాకిస్థాన్ జట్టు భారత్‌లో పర్యటించదు. ఆ టోర్నీల్లో పాక్ ఆడే మ్యాచులు తటస్థ వేదికల్లోనే జరగనున్నాయి.
Smriti Mandhana : వెస్టిండీస్‌తో మూడో టీ20 మ్యాచ్.. భారీ రికార్డుపై కన్నేసిన స్మృతి మంధాన..
ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడ్‌లో నిర్వహించేందుకు అంగీకరించిన పీసీబీకి ఐసీసీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2028 ఆతిథ్య హక్కులను ఇచ్చింది. ఈ టోర్నీకి కూడా హైబ్రిడ్ మోడ్ వర్తిస్తుంది. 2029-2031 మధ్య జరిగే ఐసీసీ మహిళల టోర్నీని ఆస్ట్రేలియా వేదికగా జరుగుతాయని చెప్పింది.
ఇక పాకిస్థాన్ వేదికగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్‌ను అతి త్వరలోనే వెల్లడించనున్నట్లు పేర్కొంది. 2017లో చివరి సారిగా ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది. నాటి ఫైనల్‌లో భారత్‌ను ఓడించి పాకిస్థాన్ విజేతగా నిలిచింది. ఇదిలా ఉంటే.. వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో 8 జట్లు పాల్గొననున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి సంబంధించిన తటస్థ వేదిక ఏంటి అనేది ఐసీసీ తెలియజేయలేదు. షెడ్యూల్ అప్పుడే దీని పై స్పష్టత రానుంది.
Virat Kohli : బాక్సింగ్‌డే టెస్టుకు ముందు.. మహిళా జర్నలిస్టుతో ఎయిర్‌పోర్టులో కోహ్లీ గొడవ..!