Virat Kohli : బాక్సింగ్‌డే టెస్టుకు ముందు.. మ‌హిళా జ‌ర్న‌లిస్టుతో ఎయిర్‌పోర్టులో కోహ్లీ గొడ‌వ‌..!

టీమ్ఇండియా స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

Virat Kohli : బాక్సింగ్‌డే టెస్టుకు ముందు.. మ‌హిళా జ‌ర్న‌లిస్టుతో ఎయిర్‌పోర్టులో కోహ్లీ గొడ‌వ‌..!

Kohli Clashes With Reporter At Melbourne Airport Over Family Privacy

Updated On : December 19, 2024 / 2:47 PM IST

టీమ్ఇండియా స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ప్ర‌త్య‌ర్థులు క‌వ్విస్తే ఊరుకోడు. త‌న‌దైన శైలిలో వారికి స‌మాధానం ఇస్తూ ఉంటాడు. అయితే.. మైదానం వెలుప‌ల మాత్రం ఎంతో ప్ర‌శాంతంగా ఉంటుంటాడు. తాజాగా ఓ ఆస్ట్రేలియా విలేక‌రి చేసిన ప‌ని విరాట్ కోహ్లీకి కోపాన్ని తెప్పించింది. దీంతో స‌ద‌రు మీడియా ప్ర‌తినిధికి కాస్త గ‌ట్టిగానే క్లాస్ పీకాడు.

అస‌లేం జ‌రిగిందంటే..?

బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ సిరీస్‌లో మూడు మ్యాచులు ముగిసే స‌రికి భార‌త్, ఆస్ట్రేలియా జ‌ట్లు 1-1తో స‌మంగా నిలిచాయి. నాలుగో టెస్టు మ్యాచ్ డిసెంబ‌ర్ 26 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో ఈ మ్యాచ్ ఆడేందుకు భార‌త జ‌ట్టు గురువారం గ‌బ్బా నుంచి మెల్‌బోర్న్‌కు చేరుకుంది.

Ravichandran Ashwin : అంత‌ర్జాతీయ క్రికెట్‌లో రవిచంద్ర‌న్ అశ్విన్ టాప్‌-15 రికార్డులు ఇవే..

విరాట్ కోహ్లీ త‌న భార్య అనుష్క‌శ‌ర్మ‌తో పాటు పిల్ల‌లు వామికా, అకాయ్ కోహ్లీల‌తో క‌లిసి మెల్‌బోర్న్ విమానాశ్ర‌యంలో క‌నిపించ‌గానే ఆసీస్ మీడియా అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించింది.

త‌న పిల్ల‌లు ఫోటోలు తీయ‌వ‌ద్ద‌ని కోహ్లీ ఎంత చెప్పినా.. ఆసీస్ మీడియా విన‌లేదు. వారిని వీడియోలు తీయ‌సాగింది. దీంతో కోహ్లీ తీవ్ర అస‌హనానికి గురైయ్యాడు. ఈ క్ర‌మంలో ఓ మ‌హిళా జ‌ర్న‌లిస్ట్‌ను గ‌ట్టిగా మంద‌లించాడు. వెంట‌నే తీసిన వీడియోల‌ను డిలీట్ చేయాల‌ని సూచించాడు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది.